ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

mother అందని తల్లికి వందనం

ABN, Publish Date - Jun 20 , 2025 | 12:02 AM

రీ సర్వేలో సమస్యల వల్ల తల్లికి వందనం పథకం అందక అనేక మంది మహిళలు తహసీల్దార్‌, సచివాలయాలు చుట్టూ తిరుగుతున్నారు.

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద భూ సర్టిఫికెట్ల కోసం నిరీక్షిస్తున్న మహిళలు

కణేకల్లు, జూన 19(ఆంధ్రజ్యోతి): రీ సర్వేలో సమస్యల వల్ల తల్లికి వందనం పథకం అందక అనేక మంది మహిళలు తహసీల్దార్‌, సచివాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. ఈ పథకం లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం ఆయా సచివాలయాల్లో ఏర్పాటు చేసింది. అనేక మందికి అధిక స్థలాలు ఉన్నాయని, దీంతో వారిని అనర్హులకు ఆ జాబితాలో చూపించారు. క్షేత్రస్థాయిలో వారికి భూమి తక్కువగా ఉన్నా .. రికార్డుల్లో మాత్రం 10 ఎకరాల పైబడి ఉన్నట్లు నమోదయ్యాయి. దీంతో తల్లికి వందనం పథకానికి అనర్హులుగా గుర్తించారు. ప్రధానంగా గతంలో రీ సర్వేలు చేసిన గ్రామాల్లో ఇలాంటి పరిస్థితి అధికంగా ఉంది. గ్రామాల్లో భూమి సర్వే చేసినపుడు కొన్ని భూములకు సమస్యలు ఉండటంతో వాటిని పెండింగ్‌లో ఉంచారు. అలాంటి వారికి భూము లు అధిక విస్తీర్ణంలో ఉన్నట్లు నమోదయ్యాయి. దీంతో అనేక మంది తల్లికి వందనం పథకానికి అన్ని అర్హతలు ఉన్నా.. వారికి తల్లికి వందనం సొమ్ములు జమ కాలేదు. దీంతో రెవెన్యూ అధికారుల ద్వారా తమకు క్షేత్రస్థాయిలో ఎంతమేర భూమి ఉందో వాస్తవ సర్టిఫికెట్లు తీసుకొని.. వాటిని సచివాలయాల్లో అందించాల్సి ఉంది. ఈ వాస్తవ సర్టిఫికెట్ల కోసం అనేక మంది బాధితులు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరీక్షిస్తున్నారు.

Updated Date - Jun 20 , 2025 | 12:02 AM