solution రస్తా సమస్య పరిష్కారం
ABN, Publish Date - May 16 , 2025 | 12:04 AM
మండలంలోని బలిజపల్లి గ్రామ సచివాలయం రస్తా సమస్యను గురువారం అధికారులు పరిష్కరించారు.
రస్తా భూమిని చదును చేయిస్తున్న అధికారులు
నంబులపూలకుంట, మే 15(ఆంధ్రజ్యోతి): మండలంలోని బలిజపల్లి గ్రామ సచివాలయం రస్తా సమస్యను గురువారం అధికారులు పరిష్కరించారు. గతంలో ఈ రస్తా విషయంలో పలు ఘర ్షణలు జరిగాయి. పోలీస్ స్టేషనలో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం సీసీ రోడ్డు మంజూరైంది. ఆ పనులను అడ్డుకోవడంతో గురువారం తహసీల్దార్ దేవేంద్రనాయక్, ఎంపీడీఓ పార్థసారధి, ఎస్‌ఐ వలీబాషా, పోలీస్ సిబ్బంది వెళ్లి సమస్యను పరిష్కరించారు. ఎక్స్‌కవేటర్‌తో ఆ భూమిని చదును చేయించారు.
Updated Date - May 16 , 2025 | 12:04 AM