JC రీసర్వేను పకడ్బందీగా చేపట్టాలి : జేసీ
ABN, Publish Date - Apr 29 , 2025 | 11:51 PM
రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీసర్వేను ఎటువంటి తప్పుల్లేకుండా.. పకడ్బందీగా చేపట్టాలని జా యింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ పేర్కొన్నారు
ధర్మవరంరూరల్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీసర్వేను ఎటువంటి తప్పుల్లేకుండా.. పకడ్బందీగా చేపట్టాలని జా యింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలోని సమావేశభవనంలో రెవెన్యూ సిబ్బందికి రీసర్వేపై శిక్షణ, సమీక్ష నిర్వహించారు. రీసర్వేలో తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించారు. రీసర్వేను విజయవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మహేష్, డీఏఓ ఖతిజునఖుప్రా, తహసీల్దార్ నటరాజ, డివిజనలోని తహసీల్దార్లు, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లు, సర్వే అధికారులు, వీఆర్‌ఓలు పాల్గొన్నారు
Updated Date - Apr 29 , 2025 | 11:51 PM