sycamores కంపచెట్లను తొలగించండి
ABN, Publish Date - May 14 , 2025 | 11:37 PM
కదిరి-అనంతపురం జాతీయ రహదారిలో టోల్‌ప్లాజా సమీపంలో కంపచెట్లు పెరిగి రోడ్డు బార్డర్ లైన వరకు వచ్చి ప్రమాదకరంగా మారాయి.
జాతీయ రహదారిపైకి వచ్చిన కంపచెట్లు
కదిరి అర్బన, మే 14(ఆంధ్రజ్యోతి): కదిరి-అనంతపురం జాతీయ రహదారిలో టోల్‌ప్లాజా సమీపంలో కంపచెట్లు పెరిగి రోడ్డు బార్డర్ లైన వరకు వచ్చి ప్రమాదకరంగా మారాయి. ఇది జాతీయ రహదారి కావడంతో నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుంది. ద్విచక్రవాహనదారులు బార్డర్ లైనకు వెలుపలే ప్రయాణించాల్సి ఉంది. అయితే కంపచెట్లు పెరగడంతో.. బైక్‌దారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు మొదలైతే కంపచెట్లు మరింత ఏపుగా పెరిగి రోడ్డును ఆక్రమించే ప్రమాదముందని, సంబంధితాధికారులు ఆ కంపచెట్లును తొలగించేలా చర్యలు తీసుకోవాలని ద్విచక్రవాహనదారులు కోరుతున్నారు.
Updated Date - May 14 , 2025 | 11:37 PM