ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

RDT ఆర్డీటీ పాపం.. వైసీపీదే

ABN, Publish Date - Jun 05 , 2025 | 12:05 AM

ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ను చేయకుండా 2021లోనే నాటి వైసీపీ ప్రభుత్వం ఆపేసిందని, ఆ విషయాన్ని మాజీ ఎంపీ తలారి రంగయ్య తెలుసుకోవాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హితవుపలికారు.

రైలును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు

కళ్యాణదుర్గం, జూన 4(ఆంధ్రజ్యోతి): ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ను చేయకుండా 2021లోనే నాటి వైసీపీ ప్రభుత్వం ఆపేసిందని, ఆ విషయాన్ని మాజీ ఎంపీ తలారి రంగయ్య తెలుసుకోవాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హితవుపలికారు. కంబదూరు మండలంలోని కదిరిదేవరపల్లి రైల్వేస్టేషనలో కదిరిదేవరపల్లి - తిరుపతికి వెళ్లే రైలును బుధవారం పునఃప్రారంభించిన ఆయన మాట్లాడారు. ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ను వైసీపీ ప్రభుత్వం ఆపేసినప్పుడు నోరు మెదపని రంగయ్య... నేడు కళ్యాణదుర్గంలో ఆర్డీటీ సంస్థను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసి.. ఆర్డీటీ పరువు, ప్రతిష్టలను బజారుకు ఈడుస్తున్నారని మండిపడ్డారు. వెన్నుపోటుకు కేరాఫ్‌ అయిన జగనరెడ్డే కూటమి ప్రభుత్వంపై వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. మున్సిపల్‌ చైర్మనకు నాటి మంత్రి ఉషశ్రీచరణ్‌ కనీస మర్యాద కూడా ఇచ్చేది కాదని, కాని తాను మున్సిపల్‌ చైర్మనకు తన ప్రక్కనే కుర్చీ వేసి గౌరవం ఇచ్చినా పట్టణం అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని వైసీపీ నాయకులు కూడా అభివృద్ధిని అడ్డుకుంటూ, పలుచోట్ల పైప్‌లైన పగులకొడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది మంచిపద్ధతి కాదని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 12:05 AM