hits crops పంటలకు వర్షం దెబ్బ
ABN, Publish Date - May 18 , 2025 | 11:12 PM
మండలంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి వేరుశనగ, వరి నష్టాలు జరిగాయి. వీర ఓబునపల్లిలో చిన్నబాబు పొలంలో ఒకటిన్నర ఎకరాల్లో సాగుచేసిన వేరుశనగ మొలకెత్తిన దశలో వర్షాని కొట్టుకుపోయాయి.
ఓబుళదేవరచెరువు, మే 18(ఆంధ్రజ్యోతి): మండలంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి వేరుశనగ, వరి నష్టాలు జరిగాయి. వీర ఓబునపల్లిలో చిన్నబాబు పొలంలో ఒకటిన్నర ఎకరాల్లో సాగుచేసిన వేరుశనగ మొలకెత్తిన దశలో వర్షాని కొట్టుకుపోయాయి. దీంతో రూ. పదివేలు దాకా నష్టం జరిగిందని బాధిత రైతు ఆవేదన చెందారు. వారం రోజులక్రితం తాను వేరుశనగ సాగుచేశానని, ఈ వర్షం తమను నట్టేట ముంచిందని ఆవేదన చెందారు. బావాసాహెబ్‌పల్లిలో క్రిష్ణమూర్తి, రామప్ప సాగుచేసిన వరి పంట గాలీవానకు నేలకొరిగింది. దీంతో వరి పంట పూర్తిగా దెబ్బతినిందని ఆవేదన చెందారు. మండల వ్యాప్తంగా శనివారం 35.4 మి.మీ. వర్షంపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.
Updated Date - May 18 , 2025 | 11:12 PM