Puchalapalli పేదల పక్షపాతి పుచ్చలపల్లి సుందరయ్య
ABN, Publish Date - May 20 , 2025 | 01:18 AM
సీపీఎం తొలి ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుం దరయ్య పేదల పక్షపాతి అని వక్తలు కొనియాడా రు. ఆయన 40వ వర్ధ్దంతిని పట్టణంలో సోమ వారం సీఐటీయూ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీరామిరెడ్డి పంపుహౌస్ వద్ద ఆయన చిత్రపటానికి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షు లు ఓబులు, అచ్యుతప్రసాద్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
- కొనియాడిన వక్తలు ఫ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి
కళ్యాణదుర్గంరూరల్, మే 19 (ఆంధ్రజ్యోతి): సీపీఎం తొలి ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుం దరయ్య పేదల పక్షపాతి అని వక్తలు కొనియాడా రు. ఆయన 40వ వర్ధ్దంతిని పట్టణంలో సోమ వారం సీఐటీయూ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీరామిరెడ్డి పంపుహౌస్ వద్ద ఆయన చిత్రపటానికి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షు లు ఓబులు, అచ్యుతప్రసాద్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడు తూ.. సుందరయ్య అగ్రకుల భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పటికీ.. పేదలు, బడుగు బలహీ న వర్గాల పక్షాన నిలబడి వారి అభ్యున్నతి కోసం అనేక పోరాటాలు చేశారన్నారు.. సమాజంలో అం టరానితనం నిర్మూలనకు ఎంతగానో కృషి చేశారన్నారు. ఆయ న పేరు సుందరరామిరెడ్డి అయితే అందులో రెడ్డిని తొలగించి సుందరయ్యగా మార్చుకున్న గొప్ప వ్యక్తి అని గుర్తు చేశారు. ఆయన ఆశ య సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కో రారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అచ్యుత ప్రసాద్, మండల అధ్యక్షుడు రంగనాథ్, శ్రీరామిరెడ్డి యూనియన నాయకులు వన్నూరుస్వామి, ప రమేష్, హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - May 20 , 2025 | 01:19 AM