ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pedda Reddy పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు

ABN, Publish Date - Jun 15 , 2025 | 12:07 AM

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్లనీయకుండా పోలీసు అధికారులు తిమ్మంపల్లిలో మరోసారి అడ్డుకున్నారు.

పెద్దారెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులు

యల్లనూరు, జూన 14(ఆంధ్రజ్యోతి): తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి వెళ్లనీయకుండా పోలీసు అధికారులు తిమ్మంపల్లిలో మరోసారి అడ్డుకున్నారు. శనివారం ఉదయాన్నే పెద్దారెడ్డి తాడిపత్రికి వెళుతున్నారని సమాచారం పోలీసులకు రావడంతో అనంతపురం రూరల్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లే అన్ని మార్గాల్లో పోలీసు వాహనాలను అడ్డంగా ఉంచారు. 7గంటల సమయంలో పెద్దారెడ్డి ఇంటివద్ద నుంచి బయటకు రావడానికి ప్రయత్నించినప్పుడు డీఎస్పీ వెంకటేశ్వర్లు, రూరల్‌ సీఐ సత్యబాబు, మరికొంతమంది పోలీసులు అడ్డుచెప్పారు. పోలీసులు ఇక్కడి నుంచి కదలకూడదంటూ నోటీసులు జారీచేయడంతో ఆయన వెనక్కి వెళ్లిపోయారు.

Updated Date - Jun 15 , 2025 | 12:07 AM