ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

bridge రామసాగరం వంతెన నిర్మాణానికి ఓకే

ABN, Publish Date - Jun 11 , 2025 | 12:20 AM

మండలంలోని రామసాగరం గ్రామం వద్ద వంతెన నిర్మాణానికి రూ.91 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది

వంతెన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలిస్తున్న ఉన్నతాధికారులు (ఫైల్‌)

బెళుగుప్ప, జూన 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని రామసాగరం గ్రామం వద్ద వంతెన నిర్మాణానికి రూ.91 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇక్కడిపెన్నానదిపై ఉన్న వంతెన మీదుగా అనంతపురం మండలానికి రాకపోకలు సాగేవి. కూడేరు మీదుగా 47 కిలోమీటర్లలోపే ప్రయాణించి.. జిల్లా కేంద్రానికి చేరుకునేవారు. బీఏబీఆర్‌ బ్యాక్‌ వాటర్‌ వల్ల ఈ వంతెన కూలిపోయింది. దీంతో ఆత్మకూరు మండలం మీదుగా 65 కిలోమీటర్లు ప్రయాణించి జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నారు. రామసాగరం గ్రామం వద్ద వంతెనను నిర్మిస్తే దాదాపు 20 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. అంతేకాకుండా బెళుగుప్ప మండలంతోపాటు ఉరవకొండ మండలంలోని రాంపురం మండల ప్రజలకూ ఉపాధి లభిస్తుంది. బస్సు సౌకర్యముంటే రోజూ పట్టణానికి వెళ్లి కూలీపనులు చేసుకుంటారు. దీంతోపాటు రాయదుర్గం, కర్ణాటక చిత్రదుర్గం, మొలకాల్మూరు ప్రాంత ప్రజలకూ అనుకూలంగా ఉంటుంది. ఈ వంతెన నిర్మాణం కోసం మండల వాసులు దాదాపు 20 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఈ వంతెనను నిర్మాస్తామని నాడు పయ్యావుల కేశవ్‌ మండల ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారం చేపట్టాక అక్కడ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. నూతన ప్రభుత్వం ఆ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఎన్నో ఏళ్ల కల సాకారం అవుతుండటంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 11 , 2025 | 12:20 AM