Akka Deities అక్కదేవతలకు ఎలవగంప సమర్పణ
ABN, Publish Date - May 10 , 2025 | 12:26 AM
మండలంలోని గౌనిపల్లి వద్ద ఉన్న సామ్రాజ్యుల కొండలో వెలసిన అక్కదేవతలకు శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఎలవగంపను సమర్పించారు.
అక్కదేవతల ప్రతిమలా చిన్నారులు
ఓబుళదేవరచెరువు, మే 9(ఆంధ్రజ్యోతి): మండలంలోని గౌనిపల్లి వద్ద ఉన్న సామ్రాజ్యుల కొండలో వెలసిన అక్కదేవతలకు శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఎలవగంపను సమర్పించారు. కరావులపల్లికి చెందిన వెంకటేష్, విశ్రాంత హెల్త్ సూపర్‌వైజర్ ధనలక్ష్మీ పూజా సామగ్రిని సమకూర్చారు. అక్కదేవతల ప్రతిమలుగా ఏడుగురు చిన్నారులు ఎలవగంపను ఉరుముల, వాయిద్యాల నడుమ సమర్పించారు. గౌనిపల్లిలోని పురవీధులగుండా ఎలవగంపను సామ్రాజ్యుల కొండ వరకు ఊరేగించారు. అనంతరం పూజారి పెద్దనారాయణప్ప ప్రత్యేక పూజలు చేశారు.
Updated Date - May 10 , 2025 | 12:26 AM