Divotional ఎండుఫలాల అలంకరణలో నెట్టికంటుడు
ABN, Publish Date - May 20 , 2025 | 01:15 AM
క సాపురంలోని నెట్టికంటి ఆలయంలో సోమవారం స్వామివారు ఎండు ఫలా ల అలంకారంలో దర్శనమిచ్చారు. దక్షిణాది హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రధానార్చకులు ఉదయమే ఆలయంలో స్వామివారి మూల విరాట్టుకు అభిషేకాలను నిర్వహించి, ఎండు ఫలాలతో అలంకరించారు.
గుంతకల్లు, మే 19(ఆంధ్రజ్యోతి): క సాపురంలోని నెట్టికంటి ఆలయంలో సోమవారం స్వామివారు ఎండు ఫలా ల అలంకారంలో దర్శనమిచ్చారు. దక్షిణాది హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రధానార్చకులు ఉదయమే ఆలయంలో స్వామివారి మూల విరాట్టుకు అభిషేకాలను నిర్వహించి, ఎండు ఫలాలతో అలంకరించారు.
అనంతరం ప్రాతఃకాల ఆరాధన చేసి, ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. తర్వాత యాగశాలలో సుందరకాండ, మన్యుసూక్త పారాయణం చేశారు. అలాగే శ్రీరామ ఆంజనేయ మూలమంత్ర అనుష్టానాలు, సుందరకాండ హోమం, మన్యుసుక్తహోమం నిర్వహించారు. సాయంత్రం నుంచి ఆంజనేయ ఉత్సవ విగ్రహానికి తమలపాకుల లక్షార్చన, వేదగోష్టి తదితర కార్యక్రమాలను జరిపారు. ఆలయ ఈఓ వాణి, ధర్మకర్త సుగుణమ్మ, ఏఈఓ వెంకటేశ్వరుడు, సూపరింటెండెంటు వెంకటేశులు, ప్రధానార్చకులు అనంతాచార్యులు, రాఘవాచార్యులు, వేద పండితుడు రామకృష్ణావధాని, పరిచారకులు, సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - May 20 , 2025 | 01:15 AM