ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chaudeshwari Devi ఘనంగా చౌడేశ్వరీదేవికి జ్యోతులు

ABN, Publish Date - Apr 16 , 2025 | 11:34 PM

అమడగూరులో చౌడేశ్వరీ దేవి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి జ్యోతి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్న భక్తులు

ఓబుళదేవరచెరువు, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): అమడగూరులో చౌడేశ్వరీ దేవి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి జ్యోతి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవ రథ పల్లకిని పలురకాల పుష్పాలు, విద్యుత దీపాలతో అలంకరించారు. మాజీ జడ్పీటీసీ పొట్టా పురుషోత్తమరెడ్డి రథోత్సవాన్ని ఆలయం వద్ద ప్రారంభించారు. జ్యోతికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి పుణ్యహవచనం, శాంతి పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతిని ఎత్తుకుని అమ్మవారి రథం ముందు ఊరేగింపును ఆలయం వరకు నిర్వహించారు. ఈ ఉత్సవానికి మండల ప్రజలేకాక కర్ణాటక భక్తులూ అధిక సంఖ్యలో హాజరయ్యారు. రాత్రి నిర్వహించిన ఆర్కెసా్ట్ర, సంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Updated Date - Apr 16 , 2025 | 11:34 PM