RDT ఆర్డీటీని ఐకమత్యంగా రక్షించుకుందాం
ABN, Publish Date - Apr 30 , 2025 | 11:29 PM
ఆర్డీటీ సంస్థను రక్షించాలని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు, ఆర్డీటీ సిబ్బం ది బుధవారం మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
ముదిగుబ్బ, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి):ఆర్డీటీ సంస్థను రక్షించాలని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు, ఆర్డీటీ సిబ్బం ది బుధవారం మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్డీటీ కార్యాల యం వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వర కు ఈ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధ ర్నా చేపట్టారు. ఈ నిరసనకు సీపీఐ, ఎమ్మార్పీఎస్, దండోరా నాయకులు మద్దతు తెలిపారు. సీపీఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు, ఆర్డీటీ ఏటీఎల్ కృష్ణ, సీపీఐ నాయకులు ఎమ్మార్పీఎస్ నాయకులు, దండోరా నాయకులు, వివిధ గ్రామాల గిరిజన మహిళలు పాల్గొన్నారు.
Updated Date - Apr 30 , 2025 | 11:29 PM