ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

RDT ఆర్డీటీకి అండగా నిలుద్దాం

ABN, Publish Date - May 03 , 2025 | 12:29 AM

ఉమ్మడి జిల్లాలో ఆర్డీటీ అనేక సేవలు అందిస్తోందని, అలాంటి సంస్థకు నేడు కుల, మత, రాజకీయాలకు అతీతంగా అండగా నిలుద్దామని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు.

సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ నేత ముసుగు మధు

ధర్మవరం, మే 2(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో ఆర్డీటీ అనేక సేవలు అందిస్తోందని, అలాంటి సంస్థకు నేడు కుల, మత, రాజకీయాలకు అతీతంగా అండగా నిలుద్దామని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలో భాగంగా ఆర్డీటీకి విదేశీ విరాళాలు అందని పరిస్థితి నెలకొంది. దీంతో ఆర్డీటీ తన సేవలను కొనసాగించలేని పరిస్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్జీఓహోంలో శుక్రవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో సీపీఐ, సీపీఎం, జనసేన, ఎమ్మార్పీఎస్‌, బీఎస్పీతో పాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, మేధావులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. ఆర్డీటీ కుల, మతాలకు అతీతంగా సేవలు అందిస్తోందన్నారు. కరోనా సమయంలోనూ ఆర్డీటీ వైద్య సేవలు అందించి.. అనేకమంది ప్రాణాలను కాపాడిందన్నారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, ఎస్‌టీయూ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర కౌన్సిలర్‌ సుధాకర్‌, రైతుసంఘం జిల్లా కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు జింకా చలపతి, జనసేన పట్టణ అధ్యక్షుడు అడ్డగిరి శ్యాంకుమార్‌, రైతు సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాటమయ్య, సీఐటీయూ మండల కన్వీనర్‌ జేవీ రమణ, కో కన్వీనర్లు అయూబ్‌ఖాన, ఎల్‌ ఆదినారాయణ, చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వెంకటస్వామి పాల్గొన్నారు.

Updated Date - May 03 , 2025 | 12:29 AM