HIV హెచఐవీ బాధితులకు మనోధైర్యమిద్దాం
ABN, Publish Date - May 18 , 2025 | 11:13 PM
హెచఐవీ బాధితుల పట్ల వివక్ష చూపకుండా... వారిలో మనోధైర్యం నింపేలా కృషి చేయాలని జిల్లా లె ప్రసీ, ఎయిడ్స్, టీబీ ఆఫీసర్ డాక్టర్ తిప్పయ్య పిలుపునిచ్చారు
పుట్టపర్తిరూరల్, మే 18(ఆంధ్రజ్యోతి): హెచఐవీ బాధితుల పట్ల వివక్ష చూపకుండా... వారిలో మనోధైర్యం నింపేలా కృషి చేయాలని జిల్లా లె ప్రసీ, ఎయిడ్స్, టీబీ ఆఫీసర్ డాక్టర్ తిప్పయ్య పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్‌తో చనిపోయిన వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మే నెల మూడో ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మోమోరియల్ పేరుతో ఇలా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఇనచార్జి వైద్యాధికారి శ్రీనివాసరెడ్డి, క్టస్టర్ ప్రోగ్రాం మేనేజర్ భాస్కర్, ఎనుమలపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారులు జోత్స్న, మునిచంద్రిక సీహెచఓ నగేష్ పాల్గొన్నారు.
Updated Date - May 18 , 2025 | 11:13 PM