games. ఇక మా ఆటలు సాగవా..!
ABN, Publish Date - Jun 11 , 2025 | 12:23 AM
వేసవి సెలవుల్లో బడి పిల్లలు పల్లెల్లో సందడి చేశారు. దాదాపు నెలన్నర పా టు క్రికెట్, గోళీల ఆట, చిల్లా కట్టె తదితర ఆటలతో సంతోషంగా గడిపారు.
బెళుగుప్ప, జూన 10(ఆంధ్రజ్యోతి): వేసవి సెలవుల్లో బడి పిల్లలు పల్లెల్లో సందడి చేశారు. దాదాపు నెలన్నర పా టు క్రికెట్, గోళీల ఆట, చిల్లా కట్టె తదితర ఆటలతో సంతోషంగా గడిపారు. గ్రామాల్లోని ఆరుబయళ్లల్లో పిల్లల ఆటలతో సందడి.. సందడిగా ఉండేది. ఈ యేడాది ముందుగానే వర్షాలు రావడంతో.. నీటి కుంటలు, వంకలు పొంగిపొర్లాయి. వాటిల్లో పిల్లలు ఈత కొడుతూ సరదా చేశారు. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన పిల్లలు.. ఏకంగా సాయంత్రం తిరిగి వచ్చేవారు. కాగా గురువారంతో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ఇక రోజులు మళ్లీ రావంటూ పిల్లలు మరింత ఎక్కువ సమయం ఆటలకు కేటాస్తున్నారు.
Updated Date - Jun 11 , 2025 | 12:23 AM