MLA సమష్టిగా విజయాలు సాధిద్దాం: గుమ్మనూరు
ABN, Publish Date - May 20 , 2025 | 01:12 AM
టీపీడీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఒక్కతాటిపై నిలిచి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయాలను సాధిద్దామని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పిలుపునిచ్చారు. పట్టణంలోని బలిజ కల్యాణ మండపంలో టీడీపీ నియోజకవర్గ మినీ మహానాడును నిర్వహించారు. ఇందులో ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యేతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ పాల్గొన్నారు.
గుంతకల్లు, మే 19(ఆంధ్రజ్యోతి): టీపీడీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఒక్కతాటిపై నిలిచి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయాలను సాధిద్దామని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పిలుపునిచ్చారు. పట్టణంలోని బలిజ కల్యాణ మండపంలో టీడీపీ నియోజకవర్గ మినీ మహానాడును నిర్వహించారు. ఇందులో ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యేతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ పాల్గొన్నారు.
తొలుత వారు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులర్పించారు. అలాగే వీర సైనికుడు మురళీ నాయక్ మృతికి మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కోటిన్నర సభ్యత్వాలున్న పార్టీగా టీడీపీ దేశంలోనే ప్రథమస్థానంలో ఉందన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. నియోజవర్గంలో చేపడుతున్న హంద్రీనీవా వైడెనింగ్, రెన్యూ సోలార్ విద్యుత ప్రాజెక్టులతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, యువతకు సైతం ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నిలుపుకుంటామని పేర్కొన్నారు. వెంక ట శివుడు యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేయడానికి అందరూ పాటుపడాలన్నారు. పనిచేసినవారందరికీ తప్పక గుర్తింపు లభిస్తుందన్నారు. అనంతరం ఈ సభలో వైటీ చెరువు నుంచి గుత్తి చెరువుకు నీరు వెళ్లేలా కాల్వ ను తవ్వాలని, హంద్రీనీవా నుంచి జీఎ్‌సబీసీకి 200 క్యూసెక్కుల నీటిని అధికారికంగా ఇవ్వాలని, సహజంగా చనిపోయిన కార్యకర్తలకు ఆర్థిక సాయం అందించాలని, తదితర తొమ్మిది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్, నాయకులు గుమ్మనూరు నారాయణ స్వామి, గుమ్మనూరు శ్రీనివాసులు, కేసీ హరి, బీఎస్ కృష్ణారెడ్డి, ఆమ్లెట్ మస్తాన యాదవ్, గుమ్మనూరు వెంకటేశులు, ప్రతాప్ నాయుడు, తలారి మస్తానప్ప, పాల మల్లికార్జున, కదిరప్ప, రాయల రామయ్య, పత్తిహిమబిందు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - May 20 , 2025 | 01:12 AM