ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kumara Swamy పంగణి నక్షత్రాన్ని పురస్కరించుకుని వేడుకలు

ABN, Publish Date - Apr 12 , 2025 | 12:23 AM

‘తమిళుల అపార దైవ భక్తి చూస్తే ఆశ్చరమేస్తుంది. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో చూపరులను ఆకట్టుకుంటారు’ అని మునిసిపల్‌ చైర్మన రమేష్‌ పేర్కొన్నాడు. హిందూపురంలోని పళనీనగర్‌, ఇందిరా నగర్‌ ప్రాంతాల్లో స్థిరపడిన తమిళులు తమ సంప్రదాయం ప్రకారం పంగణి నక్షత్రంను పురస్కరించుకొని సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం, రథోత్సవాన్ని శుక్రవారం స్థానికంగా నిర్వహించారు.

భక్తి విన్యాసాలు

సుబ్రహ్మణ్యస్వామికి కల్యాణం, రథోత్సవం

పురంలో తమిళుల సంప్రదాయ వేడుకలు

హిందూపురం అర్బన ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): ‘తమిళుల అపార దైవ భక్తి చూస్తే ఆశ్చరమేస్తుంది. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో చూపరులను ఆకట్టుకుంటారు’ అని మునిసిపల్‌ చైర్మన రమేష్‌ పేర్కొన్నాడు. హిందూపురంలోని పళనీనగర్‌, ఇందిరా నగర్‌ ప్రాంతాల్లో స్థిరపడిన తమిళులు తమ సంప్రదాయం ప్రకారం పంగణి నక్షత్రంను పురస్కరించుకొని సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం, రథోత్సవాన్ని శుక్రవారం స్థానికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్మన రమేష్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు తమిళ భక్తులు అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేసి, అందులో ప్రవేశించారు. అనంతరం చిన్నా పెద్ద తేడా లేకుండా నోటికి, కడుపునకు, వీపునకు శూలాలు గుచ్చుకొని విన్యాసాలు చేశారు. కొంత మంది వీపు, కాళ్లకు కొక్కీలు తగిలించుకొని క్రేనకు వేలాడారు. ఈ సందర్భంగా తమిళులతో పాటు హిందూపురం పట్టణ ప్రజలు కూడా సుబ్రహ్మణ్యస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొకులు తీర్చుకున్నారు.

Updated Date - Apr 12 , 2025 | 12:23 AM