cheating వెన్నుపోటుకు మారుపేరు జగన
ABN, Publish Date - Jun 04 , 2025 | 12:19 AM
మోసానికి మారు పేరు .. వెన్ను పోటుకు చిరునామా అయిన మాజీ సీఎం జగన్మోహనరెడ్డి ప్రస్తుత ప్రభుత్వంపై వెన్నుపోటు దినం పేరుతో నిరసన చేపడుతుండటం విడ్డూరంగా ఉందని టీడీపీ పట్టణాధ్యక్షుడు బండారు ఆనంద్ ఎద్దేవా చేశారు.
గుంతకల్లు, జూన 3(ఆంధ్రజ్యోతి): మోసానికి మారు పేరు .. వెన్ను పోటుకు చిరునామా అయిన మాజీ సీఎం జగన్మోహనరెడ్డి ప్రస్తుత ప్రభుత్వంపై వెన్నుపోటు దినం పేరుతో నిరసన చేపడుతుండటం విడ్డూరంగా ఉందని టీడీపీ పట్టణాధ్యక్షుడు బండారు ఆనంద్ ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ.. అన్న క్యాంటీన్లను మూసేసి జగన పేదలకు వెన్నుపోటు పొడిచారన్నారు. సొంత చిన్నాన్న వివేకానందరెడ్డికి వెన్నుపోటు పొడవడమే కాకుండా, తన పరిపాలనలో మూడు రాజధానులంటూ ప్రజలకు కూడా ద్రోహం చేశాడని అన్నారు. జగన ను నేడు ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు గుజరీ మహమ్మద్ ఖాజా, పాల మల్లికార్జున, అంజి, శివన్న, బీ శివశంకర్ పాల్గొన్నారు.
Updated Date - Jun 04 , 2025 | 12:19 AM