ISKAN ముగిసిన ఇస్కాన వేసవి శిక్షణ శిబిరం
ABN, Publish Date - May 18 , 2025 | 11:09 PM
స్థానిక మార్కెట్‌యార్డు సమీపంలోని ఇస్కాన మందిరంలో విద్యార్థులకు నిర్వహిస్తున్నట్లు వేసవి శిక్షణ శిబిరం ఆదివారంతో ముగి సింది.
ధర్మవరంరూరల్, మే 18(ఆంధ్రజ్యోతి): స్థానిక మార్కెట్‌యార్డు సమీపంలోని ఇస్కాన మందిరంలో విద్యార్థులకు నిర్వహిస్తున్నట్లు వేసవి శిక్షణ శిబిరం ఆదివారంతో ముగి సింది. ఈ సందర్భంగా మందిరంలో పూరిజగన్నాథ్, బలరామ, సుభద్ర ప్రతిమలను అలంకరించి పూజలు చేశారు. అనంతరం శిక్షణ తీసుకున్న విద్యార్థులు దశ అవతార వేషధారణలు, భగవద్గీతశ్లోకాలు, బృందావన కృష్ణుడి నాటకం, హరినామసంకీర్తనలు, నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన టీఎంసీ సభ్యుడు శ్రీకృష్ణమాధవదాస్, స్ధలదాత నల్లపేట శంకరయ్య, రామాంజినేయలు పాల్గొన్నారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన భక్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Updated Date - May 18 , 2025 | 11:09 PM