GOD : సరస్వతీ అలంకరణలో.. నీలకంఠుడు
ABN, Publish Date - Feb 23 , 2025 | 12:34 AM
మొదటి రోడ్డు కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శని వారం నీలకంఠుడు కూరగా యలతో అలంకరించిన హంస వాహనంపై సరస్వతీదేవిగా దర్శినమిచ్చాడు.
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): మొదటి రోడ్డు కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శని వారం నీలకంఠుడు కూరగా యలతో అలంకరించిన హంస వాహనంపై సరస్వతీదేవిగా దర్శినమిచ్చాడు. ఉదయం ఆలయం లో మహన్యాసపూర్వక ఏకాదశవార రుద్రాభిషేకం, ప్రత్యేక అలంకరణ, విశేష పూజా కార్యక్రమాలు, దీక్షాహోమం నిర్వహించా రు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహనంపై స్వా మివారి ఉత్సవమూర్తిని సరస్వతీదేవిగా అలంకరించి మొదటి రోడ్డు, మూడో రోడ్డు మీదుగా ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రమేష్‌బాబు, నరేంద్ర చౌదరి, శ్రీనివాసులు, ఎర్రిస్వామి, చంద్ర, భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Feb 23 , 2025 | 12:34 AM