Hanuman 22న హనుమాన శోభాయాత్ర
ABN, Publish Date - May 19 , 2025 | 11:37 PM
పట్టణంలో గురువారం హనుమాన శోభాయాత్ర చేపడుతున్నట్లు విశ్వహిందూపరిషత విభాగ్ కార్యదర్శి పులిచెర్ల వేణుగోపాల్ తెలిపారు.
ధర్మవరం, మే 19(ఆంధ్రజ్యోతి): పట్టణంలో గురువారం హనుమాన శోభాయాత్ర చేపడుతున్నట్లు విశ్వహిందూపరిషత విభాగ్ కార్యదర్శి పులిచెర్ల వేణుగోపాల్ తెలిపారు. సోమవారం స్థానిక వీహెచపీ కార్యాలయంలో అందుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించిన ఆయన మాట్లాడారు. ఈ శోభాయాత్ర లక్ష్మీచెన్నకేశవపురం ఆంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండ్, కాలేజ్, కళాజ్యోతి, ఎన్టీఆర్, గాంధీసర్కిల్ మీదుగా తిరిగి కదిరిగేటు వరకు నిర్వహిస్తామన్నారు. హిందూవులు అధిక సంఖ్యలో ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూపరిషత విభాగ్ జిల్లా ఉపాధ్యక్షుడు పోలిశెట్టి వెంగముని, జిల్లా బజరంగ్ దళ్ సంయోజక్ మురళీమోహనరెడ్డి, ప్రఖండ కార్యదర్శి దేవరకొండ రామానుజులు, ఆర్‌ఎ్‌సఎస్ ఖండ సభ్యులు ఉపాఽధ్యాయ అన్నం అరవిందు, బండ్లపల్లి నారాయణమూర్తి పాల్గొన్నారు.
Updated Date - May 19 , 2025 | 11:37 PM