devotional : ఘనంగా త్యాగరాజ ఆరాధనోత్సవం
ABN, Publish Date - Jan 19 , 2025 | 01:32 AM
త్యాగరాజ స్వామి 178వ ఆరాధనోత్సవాన్ని శనివారం సాయంత్రం మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాణి సంగీత కళానిలయం ఆధ్వర్యంలో తొలుత త్యాగరాజస్వామి చిత్రపటానికి పూజలు నిర్వ హించారు.
అనంతపురం కల్చరల్, జనవరి 18(ఆంధ్రజ్యోతి): త్యాగరాజ స్వామి 178వ ఆరాధనోత్సవాన్ని శనివారం సాయంత్రం మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాణి సంగీత కళానిలయం ఆధ్వర్యంలో తొలుత త్యాగరాజస్వామి చిత్రపటానికి పూజలు నిర్వ హించారు. అనంతరం ఆలయ ఆవరణలోని వేదికపై చెన్నైకి చెందిన మధుమతి, సుమేధల బృందం నిర్వహించిన కర్ణాటక శాస్త్రీ య సంగీత వీనులవిందు చేసిది. త్యాగరాజ కీర్తనలు ఆలపిస్తూ త్యాగరాజస్వామికి గాత్రనీరాజనం పలికారు. విజయవాణి సంగీత కళానిలయం నిర్వాహకుడు మొదలి మురళీకృష్ణ అధ్యక్షతన నిర్వ హించిన ఈ కార్యక్రమంలో విశ్రాంత తహసీల్దార్ పాలసముద్రం నాగరాజు, సంగీత కళాకారులు దివ్య, శ్రీనిధి కౌండిల్య పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jan 19 , 2025 | 01:32 AM