RDO : లింగ నిర్ధారణ చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలి
ABN, Publish Date - Feb 16 , 2025 | 01:13 AM
లింగనిర్ధారణ చేయడం చట్టరీత్యానేమని, అలాంటి చట్టాన్ని జిల్లాలో పటిష్టంగా అమలుచేయాలని అనంతపురం ఆర్డీఓ కేశవనాయుడు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో శనివారం డివిజన స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్డీఓ మాట్లాడుతూ... రాజ్యాంగం మగపిల్లలతో పాటు ఆడ పిల్లలకు సమాన హక్కులు కల్పించిందన్నారు. అయినా ఆడ పిల్లల పట్ల చిన్న వివక్ష సరికాదన్నారు.
సమీక్షలో ఆర్డీఓ కేశవనాయుడు ఆదేశం
అనంతపురం టౌన, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి) : లింగనిర్ధారణ చేయడం చట్టరీత్యానేమని, అలాంటి చట్టాన్ని జిల్లాలో పటిష్టంగా అమలుచేయాలని అనంతపురం ఆర్డీఓ కేశవనాయుడు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో శనివారం డివిజన స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్డీఓ మాట్లాడుతూ... రాజ్యాంగం మగపిల్లలతో పాటు ఆడ పిల్లలకు సమాన హక్కులు కల్పించిందన్నారు. అయినా ఆడ పిల్లల పట్ల చిన్న వివక్ష సరికాదన్నారు. లింగ నిర్ధారణ చేయించుకొని ఆడపిల్ల అని తేలితే బలవంతంగా అబార్షన చేయించుకుంటున్నారన్నారు. ఆడపిల్లలను సంరక్షించాలని ప్రభుత్వాలు లింగనిర్ధారణ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఆ చట్టానికి విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. స్కానింగ్ సెంటర్లు, సంబంధత డాక్టర్ల పట్ల కమిటీ ప్రత్యేకనిఘాఉంచాలనిసూచించారు. కార్యక్రమంలో డ్రగ్స్ ఇనస్పెక్టర్ హ నుమన్న, జిల్లా ఆస్పత్రి చిన్నపిల్లల డాక్టర్లు శంకరనారాయణ, గంగాధరరెడ్డి, డెమో త్యాగరాజు, డీపీఐఆర్‌ఓ గురుమూర్తి, పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - Feb 16 , 2025 | 01:13 AM