COLLECTOR : ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించాల్సిందే
ABN, Publish Date - Mar 05 , 2025 | 12:29 AM
ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) ద్వారా అర్హులైన ప్రతిఒక్కరికి ఉచితంగా వైద్యం అందించా ల్సిందేనని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. ఆయన మంగళ వారం కలెక్టరేట్‌లో ఎన్టీఆర్ వైద్య సేవపై సమీక్ష నిర్వహించారు.
- సమీక్షలో కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశం
అనంతపురం టౌన, మార్చి 4 (ఆంద్రజ్యోతి): ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) ద్వారా అర్హులైన ప్రతిఒక్కరికి ఉచితంగా వైద్యం అందించా ల్సిందేనని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. ఆయన మంగళ వారం కలెక్టరేట్‌లో ఎన్టీఆర్ వైద్య సేవపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.... ప్రభుత్వం పేదలకు ఉచితంగా వైద్యం అందిం చేందుకు ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహి స్తోందన్నారు. అలాంటి పథకాన్ని సామాజిక స్పృహతో చూడాల్సిందిపో యి కొందరు ఆదాయ వనరులుగా ఆలోచించి అక్రమాల కు పాల్ప డటం అన్యాయమన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా డబ్బులు వసూలు చేస్తున్నారని అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ప్రభుత్వ ఆశయాల కు అనుగుణంగా వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. సమావేశం లో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, డీఎంహెచఓ డాక్టర్ ఈబీ దేవి, డీసీహెచఎస్ డాక్టర్ రవికుమార్, రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మణ్‌ప్రసాద్, వివిధ ఆస్పత్రుల యజమానులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Mar 05 , 2025 | 12:29 AM