Flipkart ఫ్లిప్‌కార్ట్‌కు ఐదు టన్నుల శనగ విత్తనాలు
ABN, Publish Date - Apr 25 , 2025 | 11:40 PM
జిల్లాలో మొట్టమొదటి సారిగా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ద్వారా ఐదు టన్నుల వేరుశనగ విత్తనాలను ఫ్లిప్‌కార్ట్‌కు పంపినట్లు డీఆర్డీఏ పీడీ నరసయ్య తెలిపారు
తనకల్లు, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మొట్టమొదటి సారిగా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ద్వారా ఐదు టన్నుల వేరుశనగ విత్తనాలను ఫ్లిప్‌కార్ట్‌కు పంపినట్లు డీఆర్డీఏ పీడీ నరసయ్య తెలిపారు. విత్తనాల ప్రాసెసింగ్ అనంతరం సిద్ధం చేసిన ఈ విత్తనాలను ఒప్పందం మేరకు ఫ్లిప్‌కార్ట్ సంస్థకు సరఫరా చేసే కార్యక్రమాన్ని శుక్రవారం జండా ఊపి ప్రారంభించిన ఆయన మాట్లాడారు. మండలంలోని చౌడేశ్వరీ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ద్వారా చేపట్టిన వేరుశనగను పంపినట్లు తెలిపారు. వ్యాపారాలను సక్రమంగా రైతులకు ఉపయోపగపడేలా నిర్వహించండం ద్వారానే రైతు సంఘాలు (ఎఫ్‌పీఓలు) అభివృద్ధి సాధ్యమన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సంఘాల్లోని డైరెక్టర్లు స్వచ్ఛంధంగా రైతుల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. వేరుశనగ కాయల ప్రాసెసింగ్ యూనిట్ నిరంతరం ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ కేఎన నరసయ్య, షర్పు డీపీఎం శ్రీనివాసులు, జీవనోపాధులు జీపీఎం రామమోహన, ఎసీ రవీంద్ర, డైరెక్టర్లు తోట సరోజమ్మ, పెద్దక్క, ఎపీఎం రమణప్ప, పలువురు రైతు సంఘాల ప్రతినిఽధులు పాల్గొన్నారు.
Updated Date - Apr 25 , 2025 | 11:40 PM