ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

issues ఉపాధి సమస్యలు పరిష్కరించాలి

ABN, Publish Date - May 18 , 2025 | 12:10 AM

ఉపాధి పథకంలో తా ము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని మండలంలోని సోమరాజుకుంట గ్రామానికి చెందిన కూలీలు ఎంపీడీఓ కార్యాలయం వద్ద శనివారం ధర్నా చేపట్టారు.

ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న కూలీలు

నంబులపూలకుంట, మే 17(ఆంధ్రజ్యోతి): ఉపాధి పథకంలో తా ము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని మండలంలోని సోమరాజుకుంట గ్రామానికి చెందిన కూలీలు ఎంపీడీఓ కార్యాలయం వద్ద శనివారం ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ.. బిల్లులు అడిగితే ఉపాధి హామీ క్షేత్రస్థాయి సిబ్బంది పనికి వద్దంటున్నారని, వ్యవసాయ పనులకు వెళ్లినా, డబ్బులు వచ్చేవని, ఉపాధిలో చేసిన పనులకు రసీదులు, బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. పనులు చేయని కూలీలు పట్టణాల్లో ఉన్నా బిల్లులు ఇస్తున్నారని ఆరోపించారు. పనులను అడిగితే తమపైకి వారికుటుంబ సభ్యులు ఘర్షణకు దిగుతున్నారని వెంకటలక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా రోజులుగా జాబ్‌కార్డులేక ఇబ్బదులు పడుతున్నాని, ఆధార్‌కార్డులు ఇచ్చినా, జాబ్‌కార్డు మంజూరు చేయడం లేదని, పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని కూలీ రమణ వాపోయాడు. వీటిపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ పార్థసారధి, ఈసీ శ్రీధర్‌రెడ్డి ఆ కూలీలకు హామీ ఇచ్చారు.

Updated Date - May 18 , 2025 | 12:10 AM