problems మా సమస్యలు పట్టించుకోరా..!
ABN, Publish Date - Apr 22 , 2025 | 11:44 PM
స్థానిక మేదర్‌వీధికిలో కొన్ని నెలలుగా లో ఓల్టేజ్ సమస్య ఉందని, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, టీవీలు కాలిపోతున్నాయని, ఈ సమస్యను పలుమార్లు చెప్పినా ట్రాన్సకో అధికారులు పట్టించుకోలేదని ఆ ప్రాంత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రాన్సకో ఏఈని చుట్టుముట్టిన మహిళలు
కొత్తచెరువు, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): స్థానిక మేదర్‌వీధికిలో కొన్ని నెలలుగా లో ఓల్టేజ్ సమస్య ఉందని, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, టీవీలు కాలిపోతున్నాయని, ఈ సమస్యను పలుమార్లు చెప్పినా ట్రాన్సకో అధికారులు పట్టించుకోలేదని ఆ ప్రాంత మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ట్రాన్సకో ఏఈ వెంకటేశనాయక్‌ను చుట్టుముట్టి.. నిలదీశారు. శుక్రవారం లోపు అదనంగా ట్రాన్సఫార్మర్‌ను ఏర్పాటు చేస్తామని ట్రాన్సకో ఏఈ హామీ ఇవ్వడంతో వారు శాంతించి.. వెనుతిరిగారు.
Updated Date - Apr 22 , 2025 | 11:44 PM