ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA : రాజకీయాలకు అతీతంగా సీఎంఆర్‌ఎఫ్‌ పంపిణీ

ABN, Publish Date - Feb 10 , 2025 | 12:20 AM

రాజకీయాలకు అతీతంగా బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. నగరంలోని టీడీపీ అర్బన కార్యాలయంలో ఆదివారం తొమ్మిది మందికి రూ. 9.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఎమ్మెల్యేకి వారు కృతజ్ఙతలు తెలిపారు.

MLA Daggupati presenting the cheques

ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌

అనంతపురం అర్బన, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): రాజకీయాలకు అతీతంగా బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ పేర్కొన్నారు. నగరంలోని టీడీపీ అర్బన కార్యాలయంలో ఆదివారం తొమ్మిది మందికి రూ. 9.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఎమ్మెల్యేకి బాధితులు కృతజ్ఙతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గు పాటి మాట్లాడుతూ... గత ఎనిమిది నెలల్లో అర్బన పరిధిలోని 48 మందికి రూ.66.62 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేసినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ వర్తించని వారికి సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు మం జూరు చేస్తామన్నారు. పేదలకు కష్టం ఉందంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సీఎం చంద్రబాబు స్పందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే కృతజ్ఞత లు తెలియజేశారు. గత వైసీపీ హయాంలో సీఎంఆర్‌ఎఫ్‌ నిఽధులు మంజూరు చేసిన దాఖలాలు లేవన్నారు. నాయకులు ముక్తియార్‌, పోతుల లక్ష్మీనరసింహులు, పీఎల్‌ఎన మూర్తి, చేపల హరి, సంగా తేజస్విని, గోపాల్‌ గౌడ్‌, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Feb 10 , 2025 | 12:20 AM