work begins అభివృద్ధి పనులకు శ్రీకారం
ABN, Publish Date - Jun 11 , 2025 | 11:34 PM
మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బుధవారం భూమి పూజ చేశారు.
పామిడి, జూన 11 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం బుధవారం భూమి పూజ చేశారు. పామిడి-వజ్రకరూరు రోడ్డు నుంచి వంకరాజుకాలువకు రూ.1.98 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం, 44వ జాతీయ రహదారి నుంచి ఎదురూరు గ్రామానికి రూ.97.85 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం, పామిడి కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో రూ.1.60 కోట్లతో అదనపు వసతి గృహాల నిర్మాణం పనులను ఆయన ప్రారంభించారు. అంతనం మండలంలోని పెన్నప్ప గుడి వద్ద టీడీపీ మండల ఇనచార్చి గుమ్మనూరు ఈశ్వర్‌తో కలిసి ఆయన ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోందని, కూటమి ప్రభుత్వం ఇంతవరకూ చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఐకమత్యంతో ఈ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో సర్పంచు తలారి లక్ష్మిదేవి, టీడీపీ నాయకులు బొల్లు శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్ చౌదరి, గౌస్‌పీరా, సంజీవకుమార్, ఈరప్ప యాదవ్, రమేష్ నాయక్, దుబ్బన్న, ఆనంద్, సుదర్శన, జనసేన నాయకులు ధనుంజయ, సూర్యనారాయణ పాల్గొన్నారు.
Updated Date - Jun 11 , 2025 | 11:34 PM