ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

cm ముదిగుబ్బ ఎంపీపీపై సీఎంకు ఫిర్యాదు

ABN, Publish Date - Mar 13 , 2025 | 12:16 AM

ముదిగు బ్బ మండల ఎంపీపీ ఆదినారాయణ యాదవ్‌పై అమరావతిలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుధవారం తాను ఫిర్యాదు చేసినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సీఎం చంద్రబాబుతో మాట్లాడుతున్న రామకృష్ణ

ముదిగుబ్బ, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ముదిగు బ్బ మండల ఎంపీపీ ఆదినారాయణ యాదవ్‌పై అమరావతిలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుధవారం తాను ఫిర్యాదు చేసినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముదిగుబ్బ మండలం అడవి బ్రాహ్మణపల్లి తం డా గిరిజనుల భూ సమస్యలపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీపీ ఆదినారాయణ యాదవ్‌, వైసీపీకి చెందిన సి.ప్రభాకర్‌రెడ్డి, యం.శాంతమ్మ, సి.సుకన్య ముదిగుబ్బ మండలంలో గిరిజనుల సాగులో ఉన్న దాదాపు 200 ఎకరాలను వారి పేర్ల మీద నమోదు చేయించుకున్నారని వివరించామన్నారు. అలాగే చిలమత్తూరు మండలం సోమగుట్ట రెవెన్యూ గ్రామ పొలంలో సర్వే నెంబర్‌ 24 నుంచి 34 వరకు దళితులు, బీసీలకు కేటాయించిన అసైన్డ భూములు దాదాపు 73 ఎకరాలను ముదిగుబ్బ ఎంపీపీ తన కుటుంబ సభ్యుల పేరు మీద నమోదు చేయించుకున్నారని, బ్యాంకుల ద్వారా లోన్లు కూడా పొందారని తెలిపామన్నారు. అడవి బ్రాహ్మణపల్లి తండా గిరిజన భూ సమస్యలు పరిష్కరించి, న్యాయం చేయాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని సీఎంను కోరినట్లు వివరించారు. రెవెన్యూ శాఖ ద్వారా నివేదిక తెప్పించుకొని, తగు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.

Updated Date - Mar 13 , 2025 | 12:16 AM