CM Relief Fund పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి
ABN, Publish Date - May 14 , 2025 | 12:04 AM
పార్టీలకు అతీతంగా సీఎం సహా య నిధి మంజూరయ్యేలా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చొరవ చూపారు. నల్లచెరువు మండలం ఎం.అగ్రహారానికి చెందిన వైసీపీ నాయకుడు కోటిరెడ్డి గతంలో గుండె ఆపరేషన చేయించుకున్నారు.
నల్లచెరువు/కదిరి, మే 13(ఆంధ్రజ్యోతి): పార్టీలకు అతీతంగా సీఎం సహా య నిధి మంజూరయ్యేలా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చొరవ చూపారు. నల్లచెరువు మండలం ఎం.అగ్రహారానికి చెందిన వైసీపీ నాయకుడు కోటిరెడ్డి గతంలో గుండె ఆపరేషన చేయించుకున్నారు. ఆర్థిక సా యం కోసం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అతనికి రూ.2,28,323 మంజూరైంది. ఇతనితో పాటు నియోజకవర్గంలోని మరో 17 మందికి సీఎం సహాయ నిధి మంజూరైంది. వీరందరికీ మొత్తం రూ.16,32,664 మంజూరు కాగా, మంగళవారం కదిరి ఆర్‌అండ్ అండ్‌బీ బంగాల్లో బాధితులకు ఆయా చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. దీంతో వారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజశేఖర్‌బాబు, మోపూరి శెట్టి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Updated Date - May 14 , 2025 | 12:04 AM