CORPORATION : నాథుడు లేని నగరపాలిక..?
ABN, Publish Date - Jan 08 , 2025 | 12:17 AM
నగరపాలికకు పాలన భయం పట్టుకుంది. కలెక్టర్ వినోద్‌కుమార్ నగర ఇనచార్జ్ కమిషనర్, అధికారులపై అక్షింతలు వేశారు. దీంతో ఈ నెల 16 నుంచి సెలవుపై వెళ్లాలనుకున్న నగర కమిషనర్ రామలింగేశ్వర్ మంగళవారం నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు 27రోజుల పాటు సెలవులో వెళ్లారు. దీంతో నగరపాలికను నడిపించే ఉన్నతాధికారే కరువయ్యారు.
దీర్ఘకాలిక సెలవులో ఇనచార్జ్ కమిషనర్ రామలింగేశ్వర్
ఎనక్యాప్ నిధుల నత్తనడకపై కలెక్టర్ సీరియస్
నలుగురు ఉన్నతాధికారుల సీట్లు ఖాళీ
అనంతపురం క్రైం, జనవరి 7(ఆంధ్రజ్యోతి) : నగరపాలికకు పాలన భయం పట్టుకుంది. కలెక్టర్ వినోద్‌కుమార్ నగర ఇనచార్జ్ కమిషనర్, అధికారులపై అక్షింతలు వేశారు. దీంతో ఈ నెల 16 నుంచి సెలవుపై వెళ్లాలనుకున్న నగర కమిషనర్ రామలింగేశ్వర్ మంగళవారం నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు 27రోజుల పాటు సెలవులో వెళ్లారు. దీంతో నగరపాలికను నడిపించే ఉన్నతాధికారే కరువయ్యారు. పాలిక అధికారి గా ఎవరు ఎప్పుడొస్తారో...? ఎన్నిరోజులు ఉంటారో తెలి యని పరిస్థితి. అభివృద్ధి మాట దేవుడెరుగు.. కనీస సమస్యలు పరిష్క రించలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. రెగ్యులర్ కమిషనర్ నాగరాజు డిసెంబరు 15న దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లారు. మూడు వారాలకే ఇన చార్జ్ కమిష నర్ రామలింగేశ్వర్ సెలవులోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
కలెక్టర్ అక్షింతలు
ఎనక్యాప్ నిధులకు సంబంధించి కలెక్టర్ వినోద్‌కుమార్ సమీక్ష నిర్వహిస్తుండటంతో సోమవారం సాయంత్రం నగర ఇనచార్జ్ కమిషనర్ రామలింగేశ్వర్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కలెక్టరేట్‌కు వెళ్లారు. ఎనక్యాప్ నిధులకు సంబంధించి దాదాపు రూ.4కోట్ల వరకు ఖర్చు పెట్ట కుండా, ఎందుకింత నిర్లక్ష్యం.. అంటూ కలెక్టర్ మండిపడ్డారు. ఇక శాని టేషన అధ్వానంగా ఉందని, టౌన ప్లానింగ్‌కు సంబంధించి అక్రమ కట్ట డాలపై తరచూ ఫిర్యాదులు అందుతున్నాయని సీరియస్ అయ్యారు. అంతే కొంతసేపటికే కమిషనర్ సెలవులోకి వెళ్తున్నట్లు లీవ్ లెటర్‌న న గరపాలిక కార్యాలయానికి పంపారు. ఇనచార్జ్ బాధ్యతలు తీసుకునేం దుకు నగర డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర్లు అయిష్టంగా ఉన్నట్లు తెలిసింది.
నలుగురు ఉన్నతాధికారుల సీట్లు ఖాళీ
నగరపాలికలో ఏకంగా నలుగురు ఉన్నతాధికారుల సీట్లు ఖాళీగా ఉన్నాయి. కమిషనర్‌గా ఉన్న నాగరాజు గత నెల15న సెలవులోకి వెళ్లా రు. ఇప్పుడు ఇనచార్జ్ కమిషనర్(అడిషనల్ కమిషనర్)గా ఉన్న రామలిం గేశ్వర్ సెలవులోకి వెళ్లిపోయారు. మూడు నెలలుగా సెక్రటరీ పోస్టు ఖాళీగానే ఉంది. కీలకమైన టౌనప్లానింగ్ అధికారి అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) శ్రీనివాసులు నెలరోజుల పాటు సెలవు పెట్టడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఇక మేనేజర్ సతీష్‌కు శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నగర పంచాయతీ కమిషనర్‌గా ఇనచార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఆయన రేపో, మాపో అక్కడికి వెళ్లనున్నారు. ఏడాదిన్నరగా సర్వేయర్ పోస్టు ఖాళీ ఉంది. ఇప్పుడొచ్చే అధికారి ఇన్ని కీలక ఖాళీలతో ఎలా నడిపిస్తారోననని కార్పొరేషన వర్గాలు గుసగుసలాడుతున్నారు.
ఎమ్మెల్యేకి సవాల్..?
నగరపాలికలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు సవాల్ విసురుతున్నాయి. ఆయన వచ్చినప్పటి నుంచి ముగ్గు రు కమిషనర్లు మారారు. తొలుత ఉన్న ఐఏఎస్ అధికారి మేఘస్వరూప్ బదిలీపై వెళ్లగా, ఇనచార్జ్‌లుగా ఉన్న నాగరాజు, రామలింగేశ్వర్ నెలన్నర రోజుల వ్యవధిలో దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లా రు. కొంతకాలంగా నగర పాలికలో పరిస్థితులు దుర్భరంగా మారాయి. మున్సిపాలిటీలా తయారైం దని కార్పొరేషన ఉద్యోగులే అంటున్నారు. పా రిశుధ్యం, టౌనప్లానింగ్ విషయంలో ప్రజల నుంచి బహిరంగ విమర్శ లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరాన్ని అభివృద్ధి దిశగా నడిపించే అధి కా రిని రప్పించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jan 08 , 2025 | 12:18 AM