EFFECT : బోసిపోయిన నగరవీధులు
ABN, Publish Date - Mar 09 , 2025 | 11:43 PM
ఓ వైపు చాంపియనషిప్ క్రికెట్ ఫైనల్స్...మరోవైపు ఆదివారం సెలవు, ఎండ తీవ్రతతో నగరంలోని ప్రధాన రహదారులు, వీధులు నిర్మానుష్యంగా కనిపించాయి. నగరంలోని టవర్‌క్లాక్, సుభాష్‌రోడ్డు, రాజురోడ్డు, కమలా నగర్, శ్రీకంఠం సర్కిల్, హౌసింగ్‌బోర్డు, సాయినగర్, అశోక్‌నగర్, శారదా నగర్, కలెక్టరేట్ రోడ్డు, కోర్టురోడ్డు, రామ్‌నగర్ ప్లై ఓవర్, టవర్‌క్లాక్ ప్లైఓవర్ తో పాటు జాతీయ రహదారులలో వాహనాల రాకపోకలు, జనసంచారం కనిపించలేదు.
అనంతపురం క్లాక్‌టవర్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ఓ వైపు చాంపియనషిప్ క్రికెట్ ఫైనల్స్...మరోవైపు ఆదివారం సెలవు, ఎండ తీవ్రతతో నగరంలోని ప్రధాన రహదారులు, వీధులు నిర్మానుష్యంగా కనిపించాయి. నగరంలోని టవర్‌క్లాక్, సుభాష్‌రోడ్డు, రాజురోడ్డు, కమలా నగర్, శ్రీకంఠం సర్కిల్, హౌసింగ్‌బోర్డు, సాయినగర్, అశోక్‌నగర్, శారదా నగర్, కలెక్టరేట్ రోడ్డు, కోర్టురోడ్డు, రామ్‌నగర్ ప్లై ఓవర్, టవర్‌క్లాక్ ప్లైఓవర్ తో పాటు జాతీయ రహదారులలో వాహనాల రాకపోకలు, జనసంచారం కనిపించలేదు. చాంపియనషిప్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇండియా- న్యూజిల్యాండ్ ఫైనల్ మ్యాచ ఉండడంతో మధ్యాహ్నం నుంచి ప్రజలు ఇళ్లలో టీవీలకు అతుక్కుపోయారు. దీంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. ప్రజలు ఫైనల్ మ్యాచను తిలకించడానికి ఆసక్తి చూపారు. మరోవైపు ఆదివారం సెలవు రోజు కావడం, ఎండ తీవ్రత 37 డిగ్రీలుగా నమోదైంది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Mar 09 , 2025 | 11:43 PM