funds గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించండి
ABN, Publish Date - Jun 13 , 2025 | 11:52 PM
తమ గ్రామం అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎంఎంహళ్లి టీడీపీ నాయకులు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను శుక్రవారం అమరావతిలోని సచివాలయంలో విజ్ఞప్తి చేశారు.
మంత్రిని కలిసిన టీడీపీ నాయకులు
కూడేరు, జూన 13(ఆంధ్రజ్యోతి): తమ గ్రామం అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎంఎంహళ్లి టీడీపీ నాయకులు ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను శుక్రవారం అమరావతిలోని సచివాలయంలో విజ్ఞప్తి చేశారు. తమ గ్రామం నుంచి మండల కేంద్రానికి సరైన రోడ్డు లేదని, గ్రామంలో సీసీ రోడ్లు వేయించాలని కోరారు. మంత్రిని కలిసి వారిలో డీలర్ పూజారి రాజప్ప, వన్నూరస్వామి, అక్కులప్ప, శీను, పూజారి అక్కులప్ప, ఎర్రిస్వామి, ప్రవీణ్, అడ్వకేట్ వెంకటేష్ ఉన్నారు.
Updated Date - Jun 13 , 2025 | 11:52 PM