anniversary ఘనంగా ఆదిశంకరాచార్యుల జయంతి
ABN, Publish Date - May 03 , 2025 | 12:31 AM
పట్టణంలోని పేటబసవన్నకట్టవీధిలోని త్రిలింగేశ్వరుని ఆలయంలో శుక్రవారం జగద్గురు శ్రీఆదిశంకరాచార్యుల జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఆదిశంకరాచార్యుల చిత్రపటాన్ని ఊరేగిస్తున్న భక్తులు
ధర్మవరంరూరల్, మే 2(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పేటబసవన్నకట్టవీధిలోని త్రిలింగేశ్వరుని ఆలయంలో శుక్రవారం జగద్గురు శ్రీఆదిశంకరాచార్యుల జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకుడు రాఘవశర్మ ఆలయం ఎదుట ఆదిశంకరాచార్యుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం ఆదిశంకరాచార్యుల చిత్రపటాన్ని పురవీధుల్లో ఊరేగించి సంకీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.
Updated Date - May 03 , 2025 | 12:31 AM