ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MP AMBIKA: నెరవేరిన అనంత ప్రజల ఏళ్ల కల

ABN, Publish Date - Apr 18 , 2025 | 12:01 AM

పుట్టపర్తి, బెంగళూరు మధ్య నడుస్తున్న మెము రైలును అనంతపురం వరకూ పొడిగిస్తూ రైల్వే బోర్డు ఈనెల 15వ తేదీన ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గురువారం ప్రకటనలో తెలిపారు.

MP Ambika Lakshminarayana speaking on the issue of rail extension in Parliament (File)

ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ

అనంతపురం, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): పుట్టపర్తి, బెంగళూరు మధ్య నడుస్తున్న మెము రైలును అనంతపురం వరకూ పొడిగిస్తూ రైల్వే బోర్డు ఈనెల 15వ తేదీన ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గురువారం ప్రకటనలో తెలిపారు. గత పార్లమెంటు సమావేశాల్లో రైలు పొడిగింపు అంశంపై అనేకసార్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌), దక్షిణ పశ్చిమ రైల్వే (ఎస్‌డబ్ల్యూఆర్‌) జనరల్‌ మేనేజర్లను కలిసి పుట్టపర్తి-బెంగళూరు రైలును అనంతపురం వరకూ పొడిగించాలని కోరానన్నారు. కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్నను వ్యక్తిగతంగా కలిసి విన్నవించానన్నారు. వారి సహకారంతో రెండు రైల్వే జోన్లను ఒప్పించి, అనంతపురం వరకూ పొడిగించారన్నారు. దీంతో అనంతపురం ప్రజల ఏళ్ల కల నెరవేరిందన్నారు. దీంతో బెంగళూరు వెళ్లే ప్రయాణికులు ఈరైలు అనుకూలంగా ఉంటుందన్నారు. ఇది సామాన్య ప్రయాణికులతోపాటు విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలకు ఎంతో ఉపశమనం కలిగించే అంశమన్నారు. ఇప్పటి వరకూ ఉన్న స్టాపేజ్‌తో పాటు విధురాశ్వత్థం, కొత్తచెరువు, బాసంపల్లి, చిగిచెర్ల, జంగాలపల్లె, ప్రసన్నాయపల్లి స్టేషన్లలో కూడా ఈ రైలు ఆపుతారన్నారు. ఈ రైలు అనంతపురం స్టేషన నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరి సాయంత్రం 7 గంటలకు బెంగళూరు స్టేషనకు చేరుకుంటుందని ఆయన వివరించారు.

Updated Date - Apr 18 , 2025 | 12:02 AM