Amaravati Women: భారతి, జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే
ABN, Publish Date - Jun 15 , 2025 | 06:01 AM
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల చేసిన వారిని అరెస్టు చేయాలని, దీని వెనుక ఉన్న మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, వైఎస్ భారతి క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తూ రాజధానిలో...
రాజధానిలో రైతులు, మహిళల నిరసన ప్రదర్శన
తుళ్లూరు, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల చేసిన వారిని అరెస్టు చేయాలని, దీని వెనుక ఉన్న మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, వైఎస్ భారతి క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తూ రాజధానిలో మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తుళ్లూరులో రైతు జేఏసీ నేత పువ్వాడ సుధాకరరావు నేతృత్వంలో మహిళలు ప్లకార్డులు పట్టుకొని నిరసన ప్రదర్శన చేశారు. ‘సాక్షి’ డిబేట్‌లో అమరావతి మహిళలపై ఎనలిస్టు కృష్ణంరాజుతో కుట్రపూరితంగా వ్యాఖ్యలు చేయించారని, దీని వెనుక భారతీ రెడ్డి, జగన్‌రెడ్డి హస్తం ఉందని వారు ఆరోపించారు. జగన్, భారతి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను మానసిక క్షోభకు గురిచేస్తున్న వైసీపీ నేతలను, వారిని పోత్సహిస్తున్న సాక్షి మీడియాను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి... రాజధాని అభివృద్ధి నిరోధక అరాచక ప్రభుత్వాన్ని పెంచి పోషిస్తున్న సాక్షి మీడియాను వెంటనే నిషేధించాలి.. మహిళలను కించపరచిన వారిని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు.
Updated Date - Jun 15 , 2025 | 06:02 AM