AP State Energy Department: గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ క్యాపిటల్‌గా అమరావతి
ABN, Publish Date - Jul 29 , 2025 | 06:23 AM
గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ క్యాపిటల్‌గా 2030 నాటికి అమరావతిని తీర్చిదిద్దే పాలసీని అమలు చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వు జారీ చేసింది.
2030 నాటికి తీర్చిదిద్దేలా పాలసీ అమలు
ఉత్తర్వులు జారీ చేసిన ఇంధన శాఖ
అమరావతి, జూలై 28(ఆంధ్రజ్యోతి): గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ క్యాపిటల్‌గా 2030 నాటికి అమరావతిని తీర్చిదిద్దే పాలసీని అమలు చేస్తూ రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వు జారీ చేసింది. రాష్ట్రంలో 2027 నాటికి రెండు గిగావాట్లు, 2029 నాటికి 5 గిగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2029 నాటికి ఏటా 1.50 ఎంపీటీఏ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2029 నాటికి 25 గిగావాట్ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకునేలా గ్రీన్ ఎనర్జీ కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Updated Date - Jul 29 , 2025 | 06:25 AM