ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MP Purandeswari: అమరావతిపై కొందరు విషం కక్కుతున్నారు

ABN, Publish Date - Jun 17 , 2025 | 05:10 AM

రాజధాని అమరావతిపై కొందరు విషం కక్కుతున్నారు. అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

  • తల్లికి, చెల్లికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో తెలియని పరిస్థితిలో కొందరున్నారు

  • పాకిస్థాన్‌లో ప్రభుత్వం, ఉగ్రవాదం సమాంతరంగా పాలిస్తున్నాయి: పురందేశ్వరి

రాజమహేంద్రవరం అర్బన్‌, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): ‘రాజధాని అమరావతిపై కొందరు విషం కక్కుతున్నారు. అసభ్యకరంగా మాట్లాడుతున్నారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘తల్లికి, చెల్లికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితిలో కొందరున్నారు. ఇది చాలా బాధాకరం. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను లాభాల్లోకి తీసుకురావాలనేదే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆలోచన . వికసిత్‌ భారత్‌ కలలు సాకారం కావాలంటే వికసిత్‌ రాష్ట్రాలు కావాలి. పాకిస్థాన్‌లో ప్రభుత్వం, ఉగ్రవాద సంస్థలు సమాంతర పాలన సాగిస్తున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో పాకిస్థాన్‌ తీవ్రవాదంపై భారతదేశ వాణిని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. ప్రపంచంలో అనేక దేశాలు ఉగ్రవాద కార్యకలాపాలతో బాధపడుతున్నాయి. ఇదే విషయాన్ని దౌత్య పర్యటనలో ఆయా దేశాలకు స్పష్టం చేశాం’ అని పురందేశ్వరి అన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 05:11 AM