Amaravati: ‘అమరావతి’కి అగ్రతాంబూలం..
ABN, Publish Date - Mar 01 , 2025 | 10:01 AM
కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రకటించిన పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడంతో అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి ఆశలు, ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడుగుల సంక్షేమానికి పెద్దపీట వేశారు.
- గతంలో కంటే రాజధానికి రెట్టింపు నిధులు
- మార్చి 15 నుంచి జోరందుకోనున్న నిర్మాణ పనులు
- గుంటూరు ఛానల్ భూసేకరణకు రూ.100 కోట్లు
- ఆచార్య ఎన్జీ రంగా అగ్రి వర్సిటీకి రూ.507 కోట్లు జూ గోదావరి - పెన్నా నదుల అనుసంధానానికి రూ.200 కోట్ల
- కూటమి ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులపై హర్షం
రూ.కోట్లలో కేటాయింపులు.. గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులకు నిధుల వరద. శుక్రవారం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అమరావతికి అగ్రతాంబూలం దక్కింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి(Amaravati) అన్న పేరుకు.. రాజధాని పనుల అంశాలకే చోటు ఇవ్వకుండా సరిపెట్టారు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతిపై దృష్టి పెట్టడంతో పాటు నిధులు కేటాయించింది. తొలిబడ్జెట్‌లో రూ.3 వేల కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్‌లో రాజధాని పనులకు రూ.6 వేల కోట్లను ప్రత్యేకంగా కేటాయించింది. అంతేగాకుండా రాజధానిలోని వివిధ ప్రాజెక్టులకు నిధులు.. గతంలో నిలిచిపోయిన భూసేకరణకు కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు జరగడంతో ఉమ్మడి గుంటూరు జిల్లావాసులతో పాటు రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Women Welfare: 4,332 కోట్లు మహిళా, శిశు సంక్షేమానికి ..
గుంటూరు: కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రకటించిన పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడంతో అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి ఆశలు, ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడుగుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు సంబంధించి పలు ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తూ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడుగులపై బడ్జెట్లో ప్రభుత్వం వరాల వర్షం కురిపించడంపై కూడా ఆయా వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
పాఠశాలల్లో మౌలిక వసతులు, తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, విద్యాకిట్లు తదితర పథకాల కోసం పెద్దఎత్తున కేటాయింపులపై విద్యావేత్తలతో పాటు విద్యా ర్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వందల సంఖ్యలో తరగతి గదుల నిర్మాణం నిలిచిపోగా, వాటి పునః ప్రారంభించడానికి బడ్జెట్ కేటాయింపులు చేయనున్నారు. ప్రధానంగా నాడు నేడు పేరుతో అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణం, తాగునీటి కోసం కొనుగోలు చేసిన ప్లాంట్స్ ఇన్‌స్టలేషన్, నూతన భవనాల నిర్మాణం తదితరా లకు నిధులు ఉపయోగించనున్నారు. ఇప్పటికే ఏర్పాటైన డిజిటల్ తరగతు ల్ని మరింత ఆధునికంగా తీర్చిదిద్దడానికి ఏర్పాట్లు చేయనున్నారు. గత ప్ర భుత్వ హయాంలో సంక్షేమ పథకాలు నిర్వీర్యమయ్యాయి. ఈ నేప థ్యంలో ప్రభుత్వం సంక్షేమానికి పెద్దఎత్తున బడ్జెట్‌లో నిధులు కేటాయించింది.
అమరావతికి.. రూ.6 వేల కోట్లు
నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాజధాని అభి వృద్ధి కోసం కిందటి బడ్జెట్లో కేటాయించిన నిధుల కంటే ఈ బడ్జెట్లో రెట్టింపు కేటాయించింది. రాజధానిపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిని మరోమారు ప్రకటించింది. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై బడ్జెట్లో ప్రస్తావనకు కూడా నోచుకోని రాజధాని అమరావతి, కూటమి ప్రభుత్వ బడ్జెట్లలో అగ్రతాంబూలం అందుకుంది. కిందటి బడ్జెట్లో రూ.3వేల కోట్లు కేటాయించగా ఈసారి అమరావతి కేపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టుల కింద ఆ మొత్తాన్ని రూ.6 వేల కోట్లకు పెంచింది. ఇప్పటికే ఐకానిక్ టవర్స్‌గా ఉన్న సచివాలయ భవన సముదాయం, అసెంబ్లీ, హైకోర్టు(Assembly, High Court) భవనాల నిర్మాణ పనులు జోరందుకోనున్నాయి.
ఇప్పటికే ఆ పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరింది. అన్నీ సకాలంలో జరిగితే మార్చి 15 నుంచి రాజధాని నిర్మాణ పనులు మరింత జోరందుకోనున్నాయి. 2014- 19ల మధ్య ప్రాధాన్యతను సంతరించుకున్న మెట్రో రైలు ప్రాజెక్టు వైసీపీ హయాంలో ప్రస్తావనకు కూడా నోచుకోలేదు. తాజా బడ్జెట్లో భారీ కేటాయింపుల నేపథ్యంలో మెట్రో ఆశలకు రెక్కలు వచ్చాయి. అమరావతి నిర్మాణంలో కీలకమైన భూ సమీకరణకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. తాజాగా రాజధాని పరిధిలోని కీలక రహదారులను జాతీయ రహదారి ఎన్‌హెచ్- 16కు అనుసంధానించే ప్రక్రియ తెరమీదకి వచ్చింది. కరకట్ట రహదారి విస్తరణ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భూసమీకరణ జరగాల్సి ఉంది. అలాగే గతంలో కొన్ని గ్రామాల్లో రైతులు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు నిరాకరించారు. ఇప్పుడు వారంతా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఇలా భూసమీకరణ అవసరాల నిమిత్తం తాజాగా బడ్జెట్లో మరో 297.82 కోట్లు కేటాయించారు.
నేతన్నలకు ఉచిత విద్యుత్
నేతన్నలు, నాయీబ్రాహ్మణులకు విద్యుత్ భారం తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నట్లుగానే నేతన్నలకు, నాయీ బ్రాహ్మణులకు ఉచితంగా విద్యుత్ అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం అందుబాటులోకి వస్తే గుంటూరు జిల్లాలో 10 వేలు, బాపట్ల జిల్లాలో 17 వేలు, పల్నాడు జిల్లాలో 3 వేల చేనేత కుటుంబాలకు భారీ ఊరట లభించనుంది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించిన ఆదరణ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయగా, తాజాగా ఆ పథకాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం పునరుద్ధరిస్తే నాయీబ్రాహ్మణ, రజక, చేనేత, కల్లుగీత కార్మికులు, కుమ్మరి, కమ్మరి ఇతర కుల, చేతి వృత్తులవారికి వృత్తిపరమైన భరోసా లభించే అవకాశం ఉందనడంలో సదేహం లేదు.
దీపం- 2 14 లక్షల మందికి లబ్ధి
దీపం- 2 పథకాన్ని ఇప్పటికే ప్రారంభించిన ప్రభుత్వం గత బడ్జెట్లో ఒక సిలిండరును లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేసింది. తాజా బడ్జెట్లో ఈ పథకానికి రూ.2,601 కోట్లు కేటాయించడంతో ఈ ఏడాది మూడు గ్యాసు సిలిండర్లు ఉచితంగా అందనున్నాయి. మూడు జిల్లాల్లోని 14 లక్షల మంది లబ్ధిదారులకు ఈ ఏడాది రూ.357 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.
అవ్వాతాతల కళ్లలో ఆనందం
అవ్వాతాతలు, వితంతువులు, వంటరి మహిళలు, దివ్యాంగులకు చేయూతనిచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌కు భారీగా నిధులు కేటాయించారు. సూపర్ సిక్సులో హామీల్లో కీలకమైన హామీని అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే పింఛను మొత్తాన్ని రూ.4 వేలకు పెంచిన ప్రభుత్వం బడ్జెట్లోనూ అదే ప్రాఽథాన్యాన్ని కల్పించింది. బడ్జెట్‌లో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని 7లక్షల 40వేల మంది లబ్ధిదారులకు రూ.3,880 కోట్లు కేటాయించింది. బడ్జెట్లోనే కేటాయింపులతో ఏడాది పాటు అవ్వాతాతల పింఛనుకు ఎలాంటి ఢోకా లేకుండా పోయింది.
ఈవార్తను కూడా చదవండి: దక్షిణాది రాష్ట్రాల తిరుగుబాటు తప్పదు
ఈవార్తను కూడా చదవండి: ఆధార్ లేకున్నా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం
ఈవార్తను కూడా చదవండి: స్వయం ఉపాధి పథకాలకు రుణాలివ్వండి
ఈవార్తను కూడా చదవండి: ‘కింగ్ ఫిషర్’ తయారీని పరిశీలించిన మహిళా శిక్షణ కానిస్టేబుళ్లు
Read Latest Telangana News and National News
Updated Date - Mar 01 , 2025 | 10:02 AM