ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా పూర్వవిద్యార్థుల సమ్మేళనం

ABN, Publish Date - Jul 14 , 2025 | 11:55 PM

నంద్యాల ఎన్జీవోస్‌ కాలనీలోని ఖలీల్‌సిద్ధిఖీ ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలలో 2004-05 పదవ తరగతి బ్యాచ పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఉపాధ్యాయులతో పూర్వవిద్యార్థులు

నంద్యాల ఎడ్యుకేషన, జూలై 14 (ఆంధ్రజ్యోతి): నంద్యాల ఎన్జీవోస్‌ కాలనీలోని ఖలీల్‌సిద్ధిఖీ ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలలో 2004-05 పదవ తరగతి బ్యాచ పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థి ముద్దంనాగనవీన ఆధ్వర్యంలో అప్పటి ఉపాధ్యాయులు నాగేశ్వరరెడ్డి, సిద్ధిఖీ, అస్ముద్దీన, మస్తాన, ఖదీర్‌, అంజాద్‌భాషలను ఘనంగా సత్కరించారు. పూర్వవిద్యార్థులకు పాఠశాలకు బీరువాను బహుమతిగా అందజేశారు.

గోస్పాడు: మండలంలోని గోస్పాడు జిల్లా పరిషత హైస్కూల్‌లో 1999-2000సంవత్సరంలో పదోతరగతి చదివిన విద్యార్థులు పాతికేళ్ల తర్వాత ఆత్మీయసమ్మేళనం సోమవారం నిర్వహించారు. అప్పటి ఉపాధ్యాయులు నందయ్య, మౌలాలి, సుధాకర్‌, రామ్మోహనరెడ్డి, రవికుమార్‌, సుధాకర్‌రెడ్డిలను ఘనంగా సన్మానించారు. ఆనాటి ఉపాధ్యాయులతో తమ మధురస్మృతులను గుర్తుచేసుకుంటూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు జాకీర్‌హుసేన, బాలరాజు, రమేష్‌, భవాని, రమణేశ్వరి, సురేష్‌, మనోహర్‌, పెద్ద ఆచారి, సుధీర్‌, రమే్‌షరెడ్డి, సుధాకర్‌రెడ్డి, లలిత, గోపాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 11:55 PM