Andhra Pradesh: అభివృద్ధిలో అల్లూరి టాప్
ABN, Publish Date - Mar 27 , 2025 | 04:38 AM
ఆంధ్రప్రదేశ్‌లో 21.19% వృద్ధిరేటుతో అల్లూరి జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని సీఎం చంద్రబాబు తెలిపారు. పార్వతీపురం మన్యం 16.9% వృద్ధిరేటుతో రెండోస్థానంలో ఉంది. 2047 నాటికి ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉంటుందని, అందులో తెలుగు ప్రజల భాగస్వామ్యం 33% ఉంటుందని పేర్కొన్నారు.
21.19 శాతం వృద్ధిరేటుతో అల్లూరి జిల్లా అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ‘ప్రకృతి వ్యవసాయం, సహజ వనరుల వల్ల సాధించారు. వారికి అభినందనలు. పార్వతీపురం మన్యం 16.9 శాతం వృద్ధిరేటుతో రెండోస్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో గిరిజన ప్రాంతాలే ఉండటం విశేషం. తర్వాతి స్థానాల్లో నెల్లూరు-14.45ు, తూర్పుగోదావరి-14.17ు, సత్యసాయి- 13.57ు, విజయనగరం-13.27ు, చిత్తూరు, అన్నమయ్య-13.22ు, ఏలూరు-13.19 ు, కాకినాడ- 12.86ు, శ్రీకాకుళం-12.76ు, నంద్యాల- 12.64ు, పశ్చిమ గోదావరి-12.21ు, తిరుపతి-12.08ు, అనంతపురం-12.01ు, అంబేడ్కర్ కోనసీమ-12ు, కడప-11.79ు, కృష్ణా-11.58ు, కర్నూలు-11.52ు, గుంటూరు-11.21ు, బాపట్ల 11ు, అనకాపల్లి-11.50ు, ప్రకాశం-11.46ు, ఎన్టీఆర్-11.09ు, విశాఖ-9.73ు, పల్నాడు- 7.54ు ఉన్నాయి. కలెక్టర్లందరూ తమ బాధ్యత తెలుసుకోవాలనే ఈ నెంబర్లు చెప్పాను. అదే బాధ్యత ప్లానింగ్ బోర్డు చైర్మన్లకు కూడా వర్తిస్తుంది. 2024-25లో రూ.2.98 లక్షల తలసరి ఆదాయం, 15.93 లక్షల కోట్లు జీఎ్‌సడీపీ నమోదైంది. రాబోయే నాలుగేళ్లలో తలసరి ఆదాయం 2.95 లక్షల నుంచి 5.43 లక్షలకు పెరగాలి’ అని చంద్రబాబు అన్నారు.
వాళ్లిద్దరూ సారీ చెప్పారు
చివరగా ఐఏఎస్ అధికారి దినేశ్ జులాయి సినిమాలోని ‘అద్భుతం జరిగినప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు’ అన్న డైలాగ్ చెప్పారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని మాట్లాడారు. ‘దీనికి నేనే సాక్ష్యం. చేసిన పనిని భవిష్యత్‌లో శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారు. అది అద్భుతం కాదు. మన బాధ్యత. గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక స్విట్జర్లాండ్ మంత్రి నా విజన్, భారతీయుల సామర్థ్యం గురించి చులకనగా మాట్లాడారు. ఆయన ఆ దేశానికి పీఎం కూడా అయ్యారు. సింగపూర్ పీఎం కూడా ఇలాగే మాట్లాడారు. ఆ తర్వాత వారిద్దరూ నాకు సారీ చెప్పారు. నేను వాస్తవంలో ఉంటాను. 2047 నాటికి ప్రపంచంలో మనదేశం అగ్రస్థానంలో ఉంటుంది. అందులో తెలుగు ప్రజల భాగస్వామ్యం 33ు ఉంటుంది’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..
Updated Date - Mar 27 , 2025 | 04:38 AM