ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mining Irregularities : గనుల అక్రమాల వీరప్రతాపం పరార్‌

ABN, Publish Date - Jan 26 , 2025 | 04:01 AM

కూటమి ప్రభుత్వం నాటి గనుల శాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డిపై మాత్రమే దృష్టిపెట్టింది. కానీ, అదే అధికారికి వెన్నుదన్నుగా ఉండి క్షేత్రస్థాయిలో అరాచకాలకు పాల్పడిన....

  • కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే జంప్‌.. జగన్‌ జమానాలో అడ్డగోలుగా దందాలు

  • నాటి మంత్రి, ఓ అధికారి కోసం అరాచకాలు.. మాట వినని క్వారీల యజమానులు

  • లీజుదారులకు పెనాల్టీలతో వేధింపులు.. విజిలెన్స్‌ తనిఖీల పేరిట దండయాత్ర

  • చీమకుర్తిలో రెండు పెద్ద గనుల్లో వాటాలు.. కృష్ణాలో వైసీపీ నేతల కోసం సెటిల్‌మెంట్‌

  • అజ్ఞాతంలోకి వెళ్లినా కన్నెత్తి చూడని సర్కారు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడు నెలలు దాటింది. జగన్‌ జమానాలో గనుల శాఖలో అడ్డగోలు అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలకు పాల్పడిన అధికారులు ఎక్కడివారు అక్కడే గప్‌చుప్‌. కూటమి ప్రభుత్వం నాటి గనుల శాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డిపై మాత్రమే దృష్టిపెట్టింది. కానీ, అదే అధికారికి వెన్నుదన్నుగా ఉండి క్షేత్రస్థాయిలో అరాచకాలకు పాల్పడిన కొందరు అధికారులపై దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా గనుల అక్రమాల వీరప్రతాపం పరారీలో ఉన్నారు. ఆగస్టు నుంచి ఆయన విధులకు హాజరు కావడం లేదు. గనుల శాఖకు సమాచారం లేదు. ప్రభుత్వం నవంబరులో ఆయన్ను సెలవు మీద పంపించామని అనుకుంటోంది. కానీ అంతకు నాలుగు నెలల ముందు నుంచే ఆయన పరారీలో ఉన్నారు. పరారీ అయ్యారంటే ఎన్ని అక్రమాలు చేసుంటారు? గనుల శాఖ ఈ మాత్రం కూడా గుర్తించలేకపోయింది.

తనిఖీల పేరిట వసూళ్లు

జగన్‌ ప్రభుత్వంలో గనుల శాఖలో ప్రకాశం జిల్లా కేంద్రంగా ఓ అధికారి విజిలెన్స్‌ విభాగంలో పనిచేశారు. నాలుగైదు జిల్లాల పరిధిలో ఆయన ప్రభావం ఉంటుంది. నాటి గనుల మంత్రి, నాటి ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఓ కీలక అధికారి అండదండలతో ఆయన రాష్ట్రం అంతా ఆక్టోప్‌సలా విస్తరించుకుపోయారు. నాటి ప్రభుత్వ పెద్దలకు ఏ గనులపై క న్నుపడినా వాటిని దక్కించుకోవాల్సిందే. తొలుత యజమానులను పిలిచి మాట్లాడేవారు.


వారు వింటే సరే. లేదంటే ఒంగోలులో ఉన్న గనుల వీరప్రతాపాన్ని తనిఖీల పేరిట ఆ గనులపైకి ఉసిగొలిపేవారు. ఇలా ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోని క్వార్ట్జ్‌, గ్రానైట్‌, గ్రావెల్‌, రోడ్‌మెటల్‌ సకల గనుల లీజుదారుల ఆఫీసులు, పరిశ్రమలపై ఈ వీరప్రతాపం ఆకస్మిక దాడులు నిర్వహించేవారు. పనిగట్టుకొని తెలుగుదేశం నేతలు, కార్యకర్తలకు చెందిన గనులు, క్వారీలపై దాడులు చేయడం ఓ డైలీ సీరియల్‌లా నడిపించారు. దాడుల అనంతరం సగటున ఒక్కో గనిపై 50 నుంచి 100 కోట్ల రూపాయల పెనాల్టీ విధిస్తూ డిమాండ్‌ నోటీసులు ఇప్పించేవారు. ఇలా గత ఐదేళ్లలో ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలో 172 లీజుదారులు, క్వారీలను తనిఖీలు చేసి... 570 కోట్ల మేర పెనాల్టీలు విధిస్తూ నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ పెద్దల లోగుట్టు తెలుసుకున్న ఈ అధికారి 2023 నుంచి సొంతంగా విజిలెన్స్‌ తనిఖీలు మొదలు పెట్టారు. లీజుదారులు, క్వారీల యజమానులను భయభ్రాంతులకు గురిచేశారు. సెటిల్‌మెంట్‌ కోసం పెద్దల దగ్గరికి వెళ్తే వందల కోట్ల ఖర్చవుతుందని, తనతో పరిష్కరించుకుంటే సింపుల్‌గా అయిపోతోందని చెబుతూ వ్యవహారాలు నడిపారు.

ఈ క్రమంలో చీమకుర్తి ప్రాంతంలో రెండు ప్రముఖ గ్రానైట్‌ కంపెనీల్లో వాటాలు పొందినట్లు తెలిసింది. ఓ కంపెనీలో తన బాబాయి కొడుకు పేరిట, మరో కంపెనీలో తన భార్య సోదరి పేరిట వాటాలు తీసుకున్నట్లు తెలిసింది. ఆ రెండు కంపెనీలకు ఏటా వందల కోట్ల టర్నోవర్‌ ఉంటుంది. సదరు అధికారి విజిలెన్స్‌లో ఉన్నంతకాలం గ్రానైట్‌ను పోర్టుకు తరలించే సమయంలో హైవేలపై లారీలను ఆపి తనిఖీలు చేయకుండా ఉండేందుకు ఆయా కంపెనీల్లో వాటా సెటిల్‌మెంట్‌ చేసుకున్నట్లు తెలిసింది.


తెలుగుదేశం నేతలకు చెందిన క్వారీల్లో తనిఖీలు చేసేందుకు ప్రభుత్వ వాహనాల్లో భారీగా కర్రలు, ఇనుపరాడ్లు, కత్తులు వంటి వాటిని వేసుకొని వెళ్లేవారు. గతంలో ఫొటోలతో సహా ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించగా నాటి మంత్రి ఆయన్ను వెనకేసుకొచ్చారు. టీడీపీ నేతల దాడుల నుంచి కాపాడుకునేందుకే వెంట తీసుకెళ్లారని సమర్థించే ప్రయత్నం చేశారు.

వెంకటరెడ్డి అరె‌స్ట్‌కుకు ముందే...

కూటమి ప్రభుత్వం వచ్చాక.. జగన్‌ జమానాలో ఇసుక టెండర్లలో అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్‌ కావడానికి కొద్దిరోజుల ముందే అక్రమాల వీరప్రతాపం పరారయ్యారు. జిల్లా కలెక్టర్‌, గనుల శాఖ డైరెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులకు సమాచారం లేదు. అప్పటి నుంచి ఉద్యోగానికి రావడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వానికి నివేదించలేదు. కానీ నవంబరులో తప్పనిసరి సెలవులో వెళ్లాల్సిన అధికారుల జాబితాలో ఆ అధికారి పేరును చేర్చారు. అంటే.. అతని పరారీకి తప్పనిసరి సెలవు కూడా తోడైంది. ఇంత జరిగినా గనుల శాఖ డైరెక్టరేట్‌ ఈ విషయాన్ని లోతుగా పరిశీలించలేదు. ఆ అధికారి అక్రమాలు, అరాచకాలేమిటో ఆరా తీయలేదు. విచారణ చేపట్టలేదు. ఇవేవీ జరగకుండా ఉండేందుకు గనుల శాఖలోనే ఓ ఉన్నతాధికారి లోపాయికారిగా సాయం చేశారని తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి

YS Sharmila: విజయసాయి ఇప్పటికైనా నిజాలు బయటపెట్టు.. షర్మిల చురకలు

విజయసాయి రాజకీయ సన్యాసంపై చంద్రబాబు ఏమన్నారంటే

వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు చెప్పానంటే

కూటమి కోసం రాజీనామా.. అసలు విషయం బయటపెట్టిన..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jan 26 , 2025 | 04:05 AM