ఏపీకి గాడ్‌ఫాదర్ చంద్రబాబు: అఖిలప్రియ
ABN, Publish Date - Jun 15 , 2025 | 06:50 AM
కన్నతల్లికి, సొంత చెల్లికి, అమరావతి రైతులకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్‌ది అని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విమర్శించారు. శనివారం, స్థానిక ఎన్టీఆర్ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్, జూన్ 14(ఆంధ్రజ్యోతి): కన్నతల్లికి, సొంత చెల్లికి, అమరావతి రైతులకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్‌ది అని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విమర్శించారు. శనివారం, స్థానిక ఎన్టీఆర్ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘సొంత బాబాయి హత్యను గుండెపోటుగా చిత్రీకరించి సునీతకు వెన్నుపోటు పొడిచింది ఎవరు? మీకు అండగా నిలిచి, ప్రజల్లో తిరిగిన షర్మిలకు వెన్నుపోటు పొడిచింది ఎవరు? విజయమ్మతో ప్రచారం చేయించుకొని, రాజకీయంగా ఆమె సేవలు వాడుకుని రాజీనామా చేయించి వెన్నుపోటు పొడిచింది ఎవరు?’ అంటూ జగన్‌పై అఖిలప్రియ మండిపడ్డారు. తమ ప్రభుత్వం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఎంతమంది చదువుకుంటే అంతమందికీ తల్లికి వందనం అమలు చేస్తోందన్నారు. ఈ పథకానికి ప్రాణం పోసిన నేత లోకేశ్ అని అన్నారు. ఏపీకి గాడ్‌ఫాదర్ సీఎం చంద్రబాబు అయితే... ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గేమ్ ఛేంజర్, మంత్రి లోకేశ్ రింగ్ మాస్టర్ అని అఖిలప్రియ అన్నారు.
Updated Date - Jun 15 , 2025 | 06:52 AM