Tender Award: అహ్మదాబాద్ కంపెనీకే తుంగభద్ర క్రస్ట్ గేట్ల టెండరు
ABN, Publish Date - Jun 04 , 2025 | 07:34 AM
అహ్మదాబాద్ హార్డ్‌వేర్ టూల్స్ అండ్ మెషినరీ ప్రాజెక్ట్స్ కంపెనీ తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేట్ల 32 గేట్ల తయారికి రూ.52 కోట్ల టెండరు అందుకుంది. ఈ కంపెనీకి క్రస్ట్ గేట్ల తయారీలో అనుభవం ఉండటంతో బోర్డు ఈ టెండరును ఆమోదించింది.
52 కోట్లతో 32 గేట్లు తయారీకి ముందు కొచ్చిన హార్డ్‌వేర్ టూల్స్ అండ్ మెషినరీ
బళ్లారి, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర డ్యాం క్రస్ట్ గేట్లు తయారీ ఈ-టెండర్‌ను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన హార్డ్‌వేర్ టూల్స్ అండ్ మెషినరీ ప్రాజెక్ట్స్ కంపెనీ దక్కించుకుందని బోర్డు ఎస్‌ఈ నారాయణ నాయక్ మంగళవారం తెలిపారు. 19వ క్రస్ట్‌గేట్ మినహా 32 గేట్లను రూ.52 కోట్లకు తయారు చేసేందుకు ఆ కంపెనీ ముందుకొచ్చిందన్నారు. రీ టెండర్‌లో నాలుగు కంపెనీలు బిడ్ దాఖలు చేయగా.. హార్డ్‌వేర్ టూల్స్ అండ్ మెషినరీ ప్రాజెక్ట్స్ అతి తక్కువకు కోట్ చేసింది. క్రస్ట్ గేట్ల తయారీలో ఆ కంపెనీకి ఉన్న అనుభవం, ఇతర అంశాలను బోర్డు అధికారులు పరిగణనలోకి తీసుకుని టెండరు ఖరారు చేశారు. 19వ క్రస్ట్ గేటును కూడా ఇదే కంపెనీ తయారు చేస్తోంది. మరో 20 రోజుల్లో ఈ గేటును అమర్చే అవకాశం ఉందని బోర్డు వర్గాలు తెలిపాయి. గతేడాది ఆగస్టు 10న వరద ఉధృతికి ఈ గేటు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.
Updated Date - Jun 04 , 2025 | 07:35 AM