Minister Lokesh: మంచి పాలసీ రెడీగా ఉంది ఏపీకి రండి
ABN, Publish Date - Jul 16 , 2025 | 04:34 AM
కర్ణాటక ఏరోస్పేస్ పరిశ్రమలను మంత్రి లోకేశ్ ఏపీకి ఆహ్వానించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఏరోస్పేస్ పరిశ్రమలకు...
ఏరోస్పేస్ ఇండస్ట్రీకి మంత్రి లోకేశ్ ఆహ్వానం
అమరావతి, జూలై 15(ఆంధ్రజ్యోతి): కర్ణాటక ఏరోస్పేస్ పరిశ్రమలను మంత్రి లోకేశ్ ఏపీకి ఆహ్వానించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఏరోస్పేస్ పరిశ్రమలకు కేటాయించిన భూములు కర్ణాటక ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో ఎక్స్ వేదికగా లోకేశ్ స్పందించారు. ఏరోస్పేస్ పరిశ్రమల కోసం తన వద్ద మంచి ఐడియా ఉందన్నారు. ఆ పరిశ్రమవర్గాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూడొచ్చు అని అన్నారు. ఏపీ వద్ద వారి కోసం ఆకర్షణీయమైన ఏరోస్పేస్ పాలసీ సిద్ధంగా ఉందని చెప్పారు. అత్యుత్తమ స్థాయిలో ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నామన్నారు. బెంగళూరుకు సమీపంలోనే వెంటనే కేటాయించేందుకు సిద్ధంగా 8,000 ఎకరాలు ఉన్నాయని తెలిపారు. త్వరలోనే కలసి మాట్లాడుకుందామంటూ ఆ పరిశ్రమలకు ఆహ్వానం పలికారు.
Updated Date - Jul 16 , 2025 | 04:35 AM