ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Additional salary: తప్పలేదు... ఇచ్చేశారు

ABN, Publish Date - May 21 , 2025 | 04:19 AM

సిట్‌ అధిపతిగా రఘురామిరెడ్డి అదనపు బాధ్యతలు నిర్వహించినందుకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం అదనపు వేతనం ఇచ్చింది. ఇదే విషయంపై ఆయన ముందుగా దరఖాస్తు పెట్టి, కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఐపీఎస్‌ కొల్లికి ‘అదనపు’ జీతం

నాడు బాబు అరెస్టే ఆయన చేసిన అదనపు పని

టీడీపీ టార్గెట్‌గా పలు బాధ్యతలు అప్పగించిన జగన్‌

నాటి అదనపు బాధ్యతలకు నేడు వేతనం

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఆయన పేరు... కొల్లి రఘురామిరెడ్డి, ఐపీఎస్‌. జగన్‌ హయాంలో ఆయనకు అప్పగించిన పని కాకుండా, అదనంగా చేసిన పని... చంద్రబాబును అరెస్టు చేయడం!

ఇలా అదనంగా చేసిన పనికి... అదనపు వేతనం చెల్లించిందెవరో తెలుసా? చంద్రబాబు ప్రభుత్వమే!

వినడానికి వింతగా ఉన్నా... ఇది నిజం! ఇంకా చెప్పాలంటే, ఇదో తప్పనిసరి చెల్లింపుల తంతు!

ధికారికంగా నిబంధనల ప్రకారం... ‘ఫుల్‌ అడిషనల్‌ చార్జి’గా అదనపు బాధ్యతలు నిర్వహించే అధికారులకు అదనపు జీతమివ్వాలి. ఇది రూల్‌! జగన్‌ ప్రభుత్వం అమరావతి భూముల్లో అక్రమాలు జరిగాయంటూ ‘సిట్‌’ నియమించిన సంగతి తెలిసిందే. దానికి డీఐజీ హోదాలో ఉన్న రఘురామిరెడ్డిని అధిపతిగా నియమించింది. అప్పటికి ఆయన విజిలెన్స్‌లో ఉన్నప్పటికీ... అదనంగా ‘సిట్‌’ పని అప్పగించారు. దాంతో ఆగకుండా... అప్పటి ప్రతిపక్ష నేతలను ఇరికించేందుకు పెట్టిన పలు సీఐడీ, ఏసీబీ కేసులను ‘అదనం’గా కొల్లికే అప్పగించారు. అందులో... ‘స్కిల్‌ డెవల ప్‌మెంట్‌’ కేసూ ఒకటి. ఇదే కేసులో కొల్లి రఘురామిరెడ్డి నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేశారు.


ఇచ్చేయాల్సిందే!

చంద్రబాబు స్థానంలో జగన్‌ ఉంటే ఏం చేసేవారు? తనను అరెస్టుచేసిన అధికారికి ‘అదనపు’ వేతనం చెల్లించే వారా? లేక శంకరగిరి మాన్యాలు పట్టించే వారా? ఈ విషయాన్ని పక్కనపెడితే... చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రఘురామిరెడ్డి చేసిన అదనపు పనికి అదనపు వేతనం చెల్లించేసింది. ‘సిట్‌’లో తాను చేసిన అదనపు పనులకు... అదనపు వేతనం ఇవ్వాలని ఫలితాల వెల్లడికి ముందే కొల్లి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇప్పుడు... కూటమి ప్రభుత్వం అందుకు ఆమోదం తెలిపింది. అదనపు వేతనం ఇస్తూ ఉత్తర్వులు (జీవో నంబరు.879) జారీ చేసింది. నిబంధనల ప్రకారం ఇలా ఇవ్వక తప్పదని అధికారులు పేర్కొంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News


Updated Date - May 21 , 2025 | 04:19 AM