ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు

ABN, Publish Date - May 18 , 2025 | 01:27 AM

జిల్లాలోని స్కానింగ్‌ కేం ద్రాల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే వాటి నిర్వాహకులపై కఠిన చర్య లు తీసుకుంటామని ఇన్‌చార్జి కలెక్టర్‌ గీతాంజలిశర్మ అన్నారు.

మచిలీపట్నం, మే 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని స్కానింగ్‌ కేం ద్రాల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే వాటి నిర్వాహకులపై కఠిన చర్య లు తీసుకుంటామని ఇన్‌చార్జి కలెక్టర్‌ గీతాంజలిశర్మ అన్నారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశపు హాలులో శనివారం ఫ్రీ కన్షెప్షన్‌ అండ్‌ ఫ్రీ నాటల్‌ డయాగ్నస్టిక్‌ టెక్నిక్స్‌ (పీసీపీఎన్టీటి) సమావేశం జిల్లా 6వ అదనపు జడ్జి పీ పాండురంగారెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జిల్లాలో స్కానింగ్‌ కేంద్రాల ఏర్పాటు, రెన్యువల్‌కు వచ్చిన దరఖాస్తులు పరిశీలించి, అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాలపై నిఘా ఉంచాలన్నారు. ఈ పరీక్షలు చేయాలని అడిగిన వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో స్త్రీ, పురుష నిష్పత్తికి సంబంధించిన వివరాలను జడ్జి పాండురంగారెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 89 స్కానింగ్‌ కేంద్రాలుండగా, వాటిలో 17 ప్రభుత్వ, 72 ప్రైవేటు కేంద్రాలున్నాయని తెలిపారు. పునరుద్ధరణకు మూడు, రద్దు కోసం ఒక స్కానింగ్‌ కేంద్రం నుంచి దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. డీఎంహెచ్‌వో శర్మిష్ట, కమిటీ సభ్యులు ధర్మతేజ, పీ వెంకటేశ్వరరావు, సీహెచ్‌ వాణిశ్రీ పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2025 | 01:27 AM