అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
ABN, Publish Date - Jun 04 , 2025 | 12:04 AM
ప్రజలకు ఇబ్బందులు తలెత్త కుండా అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని డోన ఎమ్మెల్యే కోట్ల సూ ర్యప్రకాష్ రెడ్డి ఆదేశించారు.
డోన రూరల్, జూన 3 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు ఇబ్బందులు తలెత్త కుండా అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని డోన ఎమ్మెల్యే కోట్ల సూ ర్యప్రకాష్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం డోన ఆర్‌అండ్‌బీ గెస్టు హౌస్ సమావేశ భవనంలో వివిధశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ హించారు. నియోజకవర్గంలో చేపట్టే పనులపై ఆయన సుధీర్ఘంగా చ ర్చించారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజల సౌలభ్యం కోసమే..
ప్రజల సౌలభ్యం కోసమే రేషన షాపుల పునఃప్రారంభించినట్లు ఎ మ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన అందించే కార్యక్రమాన్ని మంగళవారం డోన పట్టణంలో ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీవో నరసింహులు, తహసీల్దార్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోం
నియోజకవర్గంలో అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోమని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో డోన నియోజకవర్గంలో తాగు, సాగునీరుకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించామన్నారు. రెండు నెలల్లో ఇంటింటికి మంచినీటి కొళాయిలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. తమ తప్పులను కప్పి పుచ్చుకునేందుకే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి వెన్నుపోటు దినం కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచిన జగన రెడ్డి చరిత్ర ప్రజ లకు తెలుసునని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, సీనియర్ నాయకులు మర్రి రమణ, ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 04 , 2025 | 12:04 AM